Share News

TS Politics: రాముడు పేరుతోనే ఎన్నికల్లో నిలబడతా.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ సవాల్

ABN , Publish Date - Feb 27 , 2024 | 06:29 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలైనా బీజేపీ(BJP), కాంగ్రెస్(C0ngress) పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(MP Bandi Sanjay Kumar), మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మధ్య సవాల్, ప్రతి సవాల్‌గా రాబోయే లోక్‌సభ ఎన్నికలు నిలుస్తున్నాయి.

TS Politics: రాముడు పేరుతోనే ఎన్నికల్లో నిలబడతా..  మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ సవాల్

సిద్దిపేట: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలైనా బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(MP Bandi Sanjay Kumar), మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మధ్య సవాల్, ప్రతి సవాల్‌గా రాబోయే లోక్‌సభ ఎన్నికలు నిలుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌లో ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందని, తానే దగ్గరుండి గెలిపిస్తానని మంత్రి పొన్నం అన్నారు. బండి సంజయ్‌ను ఓడగొడతానని పొన్నం సవాల్ విసిరారు. బండి సంజయ్ పొన్నంకు ప్రతి సవాల్‌ విసిరారు. ఈసారి కూడా తానే గెలుస్తానని, తాను గెలుస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామాకు సిద్ధమా అని బండి సంజయ్‌ ప్రతి సవాల్ విసిరారు. మంగళవారం నాడు ఏబీఎన్‌తో బండి సంజయ్ మాట్లాడారు.

నా వ్యాఖ్యలకు వందశాతం కట్టుబడి ఉన్నా: బండి సంజయ్

‘‘నా విశ్వాసాలతో రాముడు పేరుతోనే పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడతా, నువ్వు నీ వాదనతో నీ అభ్యర్థిని నిలబెట్టు. నేను ఎంపీ ఎన్నికల్లో ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మళ్లీ రాముడు, హిందూ ధర్మం గురించి మాట్లాడా. ఒకవేల నువ్వు ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా.? నేనేక్కడ తప్పు మాట్లాడలేదు. మంత్రి పొన్నం వాళ్ల అమ్మను అవమానించుకుంటున్నారు. వాళ్ల అమ్మకి పాదాభివందనం కూడా చేస్తాం. ఆపితే అగే వాళ్లం కాదు.. ఉరుకునే వాళ్లం కాదు. నేను నా వ్యాఖ్యలకు వందశాతం కట్టుబడి ఉన్నా. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 17కు 17 స్థానాలు గెలవడం ఖాయం. దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవా కొనసాగుతోంది. కరీంనగర్ అభివృద్ధిపై ఎలాంటి చర్చకైనా సిద్ధం. మా ప్రభుత్వం 27 మంది బీసీలను మంత్రులను చేసింది. రేషన్ బియ్యం కూడా నేరుగా లబ్ధిదారులకు ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని మోదీని కోరారు. ప్రజాహిత యాత్ర ఎవరికి వ్యతిరేకం కాదు. రాముడు, తల్లి అంశాలపై కాంగ్రెస్‌ది అనవసర రాద్దాంతం. బీఆర్ఎస్ ఇదే విధానం అవలంభించి ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వం పథకాలను వివరిస్తున్నాం’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 06:37 PM