Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Kishanreddy: ఆ సంప్రదాయాన్ని సీఎం రేవంత్ పాటిస్తే బాగుంటుంది...

ABN , Publish Date - Mar 02 , 2024 | 03:24 PM

Telangana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 4, 5 తేదీలో ప్రధాని పర్యటన సాగనుంది. ప్రధాని పర్యటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలుంటాయని తెలిపారు. ప్రధాని రాష్ట్రానికొస్తే.. గవర్నర్, సీఎం, అధికారులు స్వాగతం పలకటం సంప్రదాయమన్నారు.

Kishanreddy: ఆ సంప్రదాయాన్ని సీఎం రేవంత్ పాటిస్తే బాగుంటుంది...

హైదరాబాద్, మార్చి 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) రెండు రోజుల పాటు తెలంగాణలో (Telangana) పర్యటించనున్నారు. ఈనెల 4, 5 తేదీలో ప్రధాని పర్యటన సాగనుంది. ప్రధాని పర్యటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలుంటాయని తెలిపారు. ప్రధాని రాష్ట్రానికొస్తే.. గవర్నర్, సీఎం, అధికారులు స్వాగతం పలకటం సంప్రదాయమని.. అయితే ఈ సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రధానికి స్వాగతం పలకాలని కోరుకుంటున్నానని... వస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఎల్లుండి (మార్చి 4) రాష్ట్రానికి పీఎం మోదీ వస్తున్నారని తెలిపారు. 4న ఆదిలాబాద్‌లో 6వేల 600కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి.. బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. 5న సంగారెడ్డిలో 9వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు.. బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారన్నారు.

మేడిగడ్డపై..

మేడిగడ్డకు అందరి కంటే ముందు తామే వెళ్లామని... మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ సరైనదే అని చెప్పుకొచ్చారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్‌ను పొలిటికల్ రిపోర్ట్ అంటూ బీఆర్ఎస్ చేసిన కామెంట్స్‌ను కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఇవి కూడా చదవండి..

Gaddam Prasad: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

AP Elections: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన ఆ రోజేనా?



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 02 , 2024 | 03:26 PM