Share News

Kavitha: రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:45 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మూన్నెళ్ళ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదని.. గుడ్డి గుర్రమని సెటైర్ విసిరారు. శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ముగిసింది.

Kavitha: రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం

హైదరాబాద్, మార్చి 8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మూన్నెళ్ళ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదని.. గుడ్డి గుర్రమని సెటైర్ విసిరారు. శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ముగిసింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని.. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

AP Politics: 2017లో జరిగిన విషయాన్ని బయటపెట్టిన ఎన్నికల వ్యూహకర్త పీకే!.. వైసీపీ నేతలు అంత తహతహలాడారా?

రేవంత్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. ఒక అమ్మాయి చనిపోతే రాజకీయానికి వాడుకున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకున్నారన్నారు. జీవో 3 నిజమైతే 30వేల ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషన్లు అమలు చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగులు కన్ఫ్యూజ్‌లో ఉన్నారన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస ప్రభుత్వం(Congress Government) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడరని.. తమ పోరాటం మహిళలకే కానీ పురుషులకు అన్యాయం చేయాలని కాదన్నారు. హారిజాంటల్ పద్దతిలో రిజర్వేషన్ పద్ధతి అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి...

Telangana: కేసీఆర్‌తో మల్లారెడ్డి కీలక భేటీ.. పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేశారట..!

MLC Kavitha: ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 04:45 PM