Share News

TG NEWS: హైదరాబాద్‌లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బడా మోసం.. మంత్రి సీతక్కకు వినతి

ABN , Publish Date - May 25 , 2024 | 08:21 PM

సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌పై యువతలో ఉన్న మోజును కొన్ని కంపెనీలు క్యాష్ చేసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని విద్యార్థులు మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి.

TG NEWS: హైదరాబాద్‌లో  మరో సాఫ్ట్ వేర్ కంపెనీ  బడా మోసం.. మంత్రి సీతక్కకు వినతి

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌పై యువతలో ఉన్న మోజును కొన్ని కంపెనీలు క్యాష్ చేసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని విద్యార్థులు మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి.

తాజాగా నగరంలో మరో సాఫ్ట్‌వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. కుంచమ్ సాఫ్ట్‌వేర్ సెల్యూషన్స్ పేరుతో ట్రెనింగ్‌తో పాటు ఉపాధి కూడా ఇస్తామంటూ పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకున్నారు. ఈ ఏడాది శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల పేరిట ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ఒక్కొ విద్యార్థి పేరుతో సుమారు రూ.4 లక్షల మేర లోన్ తీసుకున్నారు.


విద్యార్థుల ట్రైనింగ్ కొనసాగుతుండగానే బోర్డు తిప్పేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు మంత్రి సీతక్కని కలిసి తమ గోడు విన్న వించుకున్నారు. తమకు న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు. రుణాల విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులను ఆదేశించారు. విద్యార్థుల నుంచి సదరు సంస్థ పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. కుంచమ్ సాఫ్ట్‌వేర్ సెల్యూషన్స్‌ సంస్థపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


సదరు సంస్థపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంస్థకు సంబంధించిన బ్రాంచులు ఇక్కడ ఉన్నాయి. ఈ కంపెనీ వల్ల ఎంతమంది విద్యార్థులు నష్టపోయారు. ఇదివరకు ఈ సంస్థపై ఏమైనా పాత కేసులు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుంచమ్ సాఫ్ట్‌వేర్‌ ఏదైనా బ్యాంకుల్లో ఆర్థిక కార్యకలాపాలు జరిపిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: రాష్ట్రంలో RUB ట్యాక్స్.. బీజేపీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు

TG Politics: అబద్ధాల గ్యారెంటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్: రామచంద్రరావు

TG Politics: వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల మార్పిడి: మంత్రి ఉత్తమ్

Balmoori Venkat:జీఓ 46 పైన పచ్చి అబద్ధాలు చెబుతున్న కేటీఆర్

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 25 , 2024 | 08:22 PM