Share News

Hyderabad: పరేడ్‌ గ్రౌండ్‌, శంషాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - May 05 , 2024 | 12:19 PM

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఆదివారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు.

Hyderabad: పరేడ్‌ గ్రౌండ్‌, శంషాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఆదివారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ఆదివారం సాయత్రం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఆంక్షలుంటాయన్నారు. పంజాగుట్ట(Panjagutta) నుంచి గ్రీన్‌ల్యాండ్స్‌, బేగంపేట నుంచి పెరేడ్‌ గ్రౌండ్స్‌, తివోలీ క్రాస్‌ రోడ్‌ నుంచి ప్లాజా క్రాస్‌రోడ్‌ వరకు వాహనాలను నిలిపివేస్తామని తెలిపారు. క్లాక్‌టవర్‌, వైఎంసీఏ, సీటీఓ క్రాస్‌రోడ్స్‌, బ్రూక్‌బాండ్‌ క్రాస్‌ రోడ్స్‌, స్వీకార్‌ ఉపకార్‌, పంజాగుట్ట, వద్ద ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయన్నారు. సభకు వచ్చిన వారు తమ వాహనాలను నిలుపేందుకు బైసన్‌ పోలో గ్రౌండ్స్‌, కంటోన్మెంట్‌ పార్కు, హాకీ గ్రౌండ్‌ సమీపంలోని ధోబీఘాట్‌లలో స్థలం కేటాయించారు. అధికారుల వాహనాలకు జింఖానా గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ కేటాయించారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను గుర్తించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని సీపీ కోరారు.

దికూడా చదవండి: Hyderabad: ఉదయం 7 గంటలకే.. ప్రచార దాడి

సైబరాబాద్‌ పరిధిలో..

శంషాబాద్‌ పరిధిలో ఆదివారం కాంగ్రెస్‌ ర్యాలీ, బహిరంగ సభ సందర్భంగా శంషాబాద్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ ట్రాపిక్‌ జోయల్‌ డేవిస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆరాంఘర్‌ వైపు నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే వాహనాలను శంషాబాద్‌ సర్వీస్‌ రోడ్డుపై వాహనాలను అనుమతించరు. మహబూబ్‌నగర్‌ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఔటర్‌ సర్వీస్‌ రోడ్డులో వెళ్లాల్సి ఉంటుంది.

ఇదికూడా చదవండి: Hyderabad: అసదుద్దీన్‌ ప్రచారం తీరు మారిందా? గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 12:27 PM