Share News

Hyderabad: అసదుద్దీన్‌ ప్రచారం తీరు మారిందా? గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి

ABN , Publish Date - May 05 , 2024 | 10:54 AM

హైదరాబాద్‌ పార్లమెంట్‌ సిట్టింగ్‌ ఎంపీ, నాలుగుసార్లు ఓటమి ఎరుగని నేతగా.. హైదరాబాద్‌(Hyderabad) ఎంపీగా విజయాలు అందుకున్న అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ ఎన్నికల్లో భయపడుతున్నారా?

Hyderabad: అసదుద్దీన్‌ ప్రచారం తీరు మారిందా?  గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి

- అన్ని మతాల వారిని కలుపుకొని వెళుతూ ప్రచారం చేస్తున్న ఎంఐఎం అధినేత

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ పార్లమెంట్‌ సిట్టింగ్‌ ఎంపీ, నాలుగుసార్లు ఓటమి ఎరుగని నేతగా.. హైదరాబాద్‌(Hyderabad) ఎంపీగా విజయాలు అందుకున్న అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ ఎన్నికల్లో భయపడుతున్నారా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే లక్ష ఓట్లు తగ్గడం ఆయన చింతకు కారణమా? లేక బీజేపీ(BJP) తరఫున ఈసారి బరిలోకి దిగిన మాధవీలత(Madhavilatha) ప్రచారంలో దూసుకెళ్లడం ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బ తీస్తోం దా? అంటే.. ఈ ప్రశ్నలకు అసదుద్దీన్‌ ఒవైసీ నేరుగా సమాధానం ఇవ్వకపోయినా.. గత ఎన్నికలకు భిన్నంగా ఈఎన్నికల్లో అలుపెరగకుండా తిరుగుతున్న విషయాన్ని ఓటర్లు గుర్తిస్తున్నారు. గత ఎన్నికల వరకు ఎదురులేని నేతగా, ఎంత వారైనా అసద్‌ ముందు ఓడిపోవాల్సిందేనన్న ధీమా ఈసారి మజ్లిస్‌ వర్గాల్లో కనిపించడం లేదు. అందుకే అసదుద్దీన్‌ సైతం గత ఎన్నికలకు భిన్నంగా.. ఈసారి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.

ఇదికూడా చదవండి: Rahul Gandi: తెలంగాణలో రెండు చోట్ల రాహుల్ బహిరంగ సభలు

అరుదైన దృశ్యం

హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో ఓ అరుదైన దృశ్యం రెండు రోజులుగా వైరల్‌ అవుతోంది. మలక్‌పేటలో అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితులు మద్దతు పలకడం.. ఆయనకు పూలమాల, శాలువా కప్పి సత్కరించిన వీడియో వైరల్‌గా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కీలక నేతలపై కేసులు, ప్రచార నిషేధాలు చోటుచేసుకుంటున్న సందర్భంలో.. ఈ దృశ్యం కనిపించడం విశేషం. అది కూడా హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ ప్రచారంలో. మతతత్వ పార్టీ అని, నిజాం వారసులంటూ బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. అసదుద్దీన్‌కు పురోహితులు మద్దతు తెలపడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే, ముస్లిం ఓటు బ్యాంకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల మద్దతు కూడబెట్టుకోడానికి అసదుద్దీన్‌ సైతం పురోహితులు, హిందూ వర్గాల మధ్య తిరుగుతున్నారు. ఆయన ఈ ఎన్నికలను ఇంతగా సీరియ్‌సగా తీసుకోవడానికి కారణం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలేనని తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: Dogs attack. హైదరాబాద్: చిన్నారిపై కుక్కల దాడి

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మజ్లిస్‌ పార్టీ పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు కనిపించింది. ఏడు సీట్లు గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేసే ఆ పార్టీ నేతలకు ఆ రోజు ఫలితాలు ఒక్కసారిగా ఆకాశం నుంచి భూమ్మీదకు పడేశాయి. నాంపల్లి, యాకుత్‌పురా(Nampally, Yakutpura) నియోజకవర్గాల ఫలితాలు నువ్వా..నేనా అన్న రీతిలో సాగి ఎట్టకేలకు చివరి రౌండ్‌లో మజ్లి్‌సను వరించాయి. అదీ 8వందల పైచిలుకు ఓట్లతో యాకుత్‌పురా, సుమారు 2వేల ఓట్లతో నాంపల్లి సీట్లు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల ఫలితాలను చూసి అసదుద్దీన్‌ జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిస్థితి కొనసాగితే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 2లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించిన అసదుద్దీన్‌ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తగ్గడం ప్రమాదకర పరిస్థితే. దానికి తోడు ఇటీవల ఎన్నికల కమిషన్‌ సైతం ఓటరు లిస్టులను ప్రక్షాళన చేయడం.. ఇల్లు మారిన, చనిపోయిన వారిని గుర్తించి ఓట్లను తొలగించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్‌ ఎన్నికలు అసదుద్దీన్‌కు ఓ సవాల్‌గా మారాయని చెప్పవచ్చు.

భిన్నమైన రీతిలో..

గతానికన్నా భిన్నంగా.. తమది మతతత్వ పార్టీ కాదు.. లౌకిక పార్టీ అని ప్రజల్లో ధీమా నింపే ప్రయత్నాలు అసదుద్దీన్‌ ఒవైసీ చేస్తున్నారు. హిందూముస్లిం కలిసి మెలిసి ఉండాలంటూ ప్రసంగాలు.. గంగా జమునా తహజీబ్‌ పేరి ట నినాదాలు.. ఆలయ పూజారులు, హిందూ మహిళల దీవెనలు తీసుకుంటూ ఆయన ఓటర్లను ఆకర్షించుకుంటున్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్‌ నగరానికి ఎంపీగా ఉండే వ్యక్తికి ఉండాల్సిన పరిపూర్ణ లక్షణాలను ఈ ఎన్నికల్లో అసదుద్దీన్‌ బహిర్గతం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: TSRTC: ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. అలా చేస్తే ఆ ఛార్జీలు రద్దు..

Read Latest Telangana News and National News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 10:54 AM