Share News

Charlapally Central Jail: ఈ జైలుకు పాతికేళ్లు..

ABN , Publish Date - May 05 , 2024 | 11:59 AM

చర్లపల్లి కేంద్ర కారాగారం(Charlapally Central Jail) ప్రారంభమై నేటికి పాతికేళ్లు. క్షణికావేశంలో చేసిన నేరాలకు శిక్ష పడ్డ ఖైదీలు మొదలుకొని నేర ప్రవృత్తి కలిగిన రౌడీలు, జైల్లో ఉన్నా తమ పేరిట జులుం చలాయించే గ్యాంగ్‌స్టర్లు, విప్లవ బాట పట్టిన మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ ఖైదీలు, విద్యార్థి ఉద్యమ నాయకులు..

Charlapally Central Jail: ఈ జైలుకు పాతికేళ్లు..

- సంస్కరణల్లో దేశానికే ఆదర్శం చర్లపల్లి కేంద్ర కారాగారం

- ఖైదీలకు వృత్తి నైపుణ్యం, ఉపాధిలో శిక్షణ

- స్వయం సమృద్ధితో ఆర్థిక స్వావలంబన

హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారం(Charlapally Central Jail) ప్రారంభమై నేటికి పాతికేళ్లు. క్షణికావేశంలో చేసిన నేరాలకు శిక్ష పడ్డ ఖైదీలు మొదలుకొని నేర ప్రవృత్తి కలిగిన రౌడీలు, జైల్లో ఉన్నా తమ పేరిట జులుం చలాయించే గ్యాంగ్‌స్టర్లు, విప్లవ బాట పట్టిన మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ ఖైదీలు, విద్యార్థి ఉద్యమ నాయకులు.. ఇలా ఈ జైల్లో గడిపిన వారెందరో..! ఉమ్మడి రాష్ట్రంలో జైలు నిర్మా ణం కోసం 118 ఎకరాలు కేటాయించగా 18 నెలల్లో నిర్మాణం పూర్తయింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2000 మే 5న జైలును ప్రా రంభించారు. ఇందులో జైలు ప్రాంగణం 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది.

ఇదికూడా చదవండి: Hyderabad: ఉదయం 7 గంటలకే.. ప్రచార దాడి

జైలు ఆవరణ మొత్తాన్ని భద్రతా సిబ్బంది డేగ కన్నుతో కాపలా కాస్తుంటారు. ‘చర్లపల్లి’ జైలు సంస్కరణల్లో ప్రయోగాలకు కేంద్ర బిందువుగా చెప్పవచ్చు. ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగేలా విద్య, వైద్యం, మరుగు దొడ్లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తుంటారు. ఖైదీలచే ఎన్నుకోబడ్డ కమిటీలు వంటశాల నిర్వహణ, భోజన సదుపాయం, కూరగాయల సాగు వంటి పనులను అధికారుల పర్యవేక్షణలో చేస్తుంటారు. ఖైదీలు వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి శిక్షణ కోర్సులు పూర్తి చేయడం, వీలుకాని పక్షంలో జైలు ఆధ్వర్యంలో నడిచే బంకుల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తుండడం కొసమెరుపు.

ఇదికూడా చదవండి: Harish Rao: మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 11:59 AM