Share News

Marriage Video: పెళ్లి వేదికపై షాకింగ్ ఘటన.. అతిథులంతా ఒక్కసారిగా వధువుపై పడడంతో.. చివరకు..

ABN , Publish Date - Mar 14 , 2024 | 09:45 AM

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు షాకింగ్ చేసుకుంటుంటే.. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు యువకులు.. వధూవరుల ముందు ఏదో చేయబోయి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Marriage Video:  పెళ్లి వేదికపై షాకింగ్ ఘటన.. అతిథులంతా ఒక్కసారిగా వధువుపై పడడంతో.. చివరకు..

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు షాకింగ్ చేసుకుంటుంటే.. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు యువకులు.. వధూవరుల ముందు ఏదో చేయబోయి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేదికపై ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతిథులంతా ఒక్కసారిగా వధువుపై పడడంతో చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Marriage viral Video) తెగ వైరల్ అవుతోంది. వధూవరులు (bride and groom) వేదికపై ఉండగా.. వారి స్నేహితులు అక్కడికి వచ్చి వారి తలపై అక్షింతలు చల్లేందుకు ప్రయత్నిస్తారు. అక్షింతలు చల్లగానే వధూవరులు వాటిని తీసుకునేందుకు పోటీపడతారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరుగుతుంది. ఈ క్రమంలో యువకులంతా ఒకరిపై ఒకరు పడి.. చివరకు అంతా వధువుపై పడతారు.

Viral Video: వామ్మో..! ఈమేంటీ.. ట్రైన్‌లో సీటు కోసం మరీ ఇలా చేసిందేంటీ..

స్నేహితులంతా మీద పడడం గమనించిన వరుడు.. ముందే తన భార్య తల పట్టుకుని కిందకు వంచుతాడు. తర్వాత ఆమెను ముందుకు లాగి, దెబ్బలు తగలకుండా కాపాడతాడు. ఈ ఘటనతో చుట్టు పక్కల ఉన్న వారంతా నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె ఎంతో అదృష్టవంతురాలు.. మంచి భర్త దొరికాడు’’.. అంటూ కొందరు, ‘‘అరెరే..! వీళ్లంతా కలిసి ఎంత పని చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: యువతి సముద్రం ఒడ్డున స్నానం చేస్తుండగా.. సడన్‌గా ఏమైందో చూడండి..

Updated Date - Mar 14 , 2024 | 09:45 AM