Share News

Viral Video: కొండచిలువ కడుపులో గుండ్రటి ఆకారం.. ఏమై ఉంటుందని బలవంతంగా బయటికి తీయగా...

ABN , Publish Date - Jan 07 , 2024 | 09:44 PM

పాములు కప్పలు, ఎలుకలను.. అలాగే కొండచిలువలు వివిధ రకాల జంతువులను మింగడం సర్వసాధారణం. కొన్నిసార్లు ఇవి ఏవేవో వస్తువులు, జీవులను మింగడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో...

Viral Video: కొండచిలువ కడుపులో గుండ్రటి ఆకారం.. ఏమై ఉంటుందని బలవంతంగా బయటికి తీయగా...

పాములు కప్పలు, ఎలుకలను.. అలాగే కొండచిలువలు వివిధ రకాల జంతువులను మింగడం సర్వసాధారణం. కొన్నిసార్లు ఇవి ఏవేవో వస్తువులు, జీవులను మింగడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొందరు వాటిని అతికష్టం మీద బయటకు తీసి, వాటి ప్రాణాలను కాపాడుతుండడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొండచిలువ కడుపులో గుండ్రటి ఆకారం కనిపించడంతో బలవంతంగా బయటికి తీశారు. చివరకు అది మింగిన వస్తువును చూసి షాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో కొండచిలువకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ కొండచిలువ ఏదో మింగి ఇబ్బంది పడుతుండడాన్ని కొందరు గమనించారు. దీంతో దాని కడుపులో అసలు ఏముందో తెలుసుకోవాలని, కొండచిలువును పట్టుకుని కడుపు ఉన్న దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. చాలా సేపు శ్రమించి ఎట్టకేలకు కడుపులో ఉన్న దాన్ని నోటి ద్వారా బయటికి తీశారు. అయితే చివరకు దాని నోట్లో నుంచి టెన్నిస్ బంతి బయటికి రావడం చూసి అంతా షాక్ అయ్యారు.

బిర్యానీ ఆకును పక్కన పడేస్తున్నారా.. రోజూ మూడుసార్లు ఇలా చేస్తే..

ఏవైనా జీవులను మింగాల్సిన కొండచిలువ.. అందుకు విరుద్ధంగా ఇలా బంతులను మింగడం ఏంటా.. అని అంతా ఆసక్తితా గమనించారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అక్కడికి గుమికూడి ఆసక్తిగా తిలకించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కొండచిలువకు టెన్నిస్ బాల్ అంటే ఇష్టమేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇది విచిత్రమైన కొండచిలువలా ఉందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 122 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Wife: మీ కూతురు పారిపోయిందని చెప్పడంతో.. కంగారుగా అల్లుడి ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటి యజమానిని విచారించగా..

Updated Date - Jan 07 , 2024 | 09:44 PM