Share News

Viral Video: ఇది రొమాంటిక్ కోతిలా ఉందే.. కారులో కూర్చున్న మహిళా కానిస్టేబుల్స్ వద్దకు వెళ్లి మరీ..

ABN , Publish Date - Jan 06 , 2024 | 03:09 PM

కోతులు అప్పుడప్పుడూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు చేతుల్లోని ఆహార పదార్థాలను లాక్కెళ్తే.. మరికొన్నిసార్లు ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి పడేస్తుంటాయి. అలాగా ఇంకొన్నిసార్లు ...

Viral Video: ఇది రొమాంటిక్ కోతిలా ఉందే.. కారులో కూర్చున్న మహిళా కానిస్టేబుల్స్ వద్దకు వెళ్లి మరీ..

కోతులు అప్పుడప్పుడూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు చేతుల్లోని ఆహార పదార్థాలను లాక్కెళ్తే.. మరికొన్నిసార్లు ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి పడేస్తుంటాయి. అలాగా ఇంకొన్నిసార్లు మనుషుల్లాగే ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి కోతులకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా కోతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కోతి పోలీసుల కారులోకి ప్రవేశించి.. మహిళా కానిస్టేబుల్స్‌తో అసభ్యకరంగా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు పోలీసు వాహనంలో కూర్చుని ఉంటారు. వారిని దూరం నుంచి గమనించిన కోతి.. నేరుగా కారులోకి వెళ్లింది. లోపలికి వెళ్లి వారిని తేరిపారా చూసి చివరకు వారిలో ఓ ఓ కానిస్టేబుల్ వద్దకు వెళ్లింది. ఆమె మీద కూర్చుని ఆమె మొఖాన్ని (monkey misbehaved with women constables) తడుముతూ, చెంపలను తడుముతూ ఇబ్బంది పెట్టింది. కోతి చేష్టలకు షాకైన ఆమె.. నవ్వుతూ దాన్ని పక్కకు పంపించే ప్రయత్నం చేసింది. అయినా కోతి మాత్రం బలవంతంగా ఆమెను తాకాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. మధ్యలో యువతికి బలవంతంగా ముద్దు పెడుతుంది.

Viral Video: బైకుపై దుప్పటి కప్పుకొని వెళ్తున్న వ్యక్తి.. తీరా సమీపానికి వెళ్లి అతడి వెనుక చూడగా.. షాకింగ్ సీన్..

తర్వాత పక్కన ఉన్న కానిస్టేబుల్‌ను కూడా తాకాలని చూస్తుంది. ఇలా వారిపై ఎక్కడ లేని అభిమానాన్ని ప్రదర్శిస్తుంది. మిగతా పోలీసులంతా ఈ కోతిని ఆసక్తిగా గమనిస్తుంటారు. అంతా కలిసి కోతిని బయటికి పంపాలని చూసినా.. అది మాత్రం బయటికి వెళ్లేందుకు ఇష్టపడదు. చివరకు ఓ పోలీసులు కలుగజేసుకుని కారు డోరు తీసి, కోతిని బయటకు లాగేస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి పోలీసులపై మనసు పడిందేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇది రోమాంటిక్ కోతిలా ఉన్నట్టుందే’’.. అంటూ ఇంకొందరు, ‘‘దీనిపై వేధింపుల కేసు నమోదు చేయాలి’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి చుట్టేసిన పొగమంచు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

Updated Date - Jan 06 , 2024 | 03:09 PM