Share News

Viral Video: అపార్ట్‌మెంట్స్‌లోకి అడుగుపెట్టిన యువతి.. అంతలోనే చుట్టుముట్టిన కుక్కలు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jan 07 , 2024 | 07:16 PM

పల్లెలు మొదలుకొని పట్టణాలు, నగరాల వరకూ కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల కుక్కల దాడిలో చిన్నారులతో పాటూ చాలా మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇలాంటి...

Viral Video: అపార్ట్‌మెంట్స్‌లోకి అడుగుపెట్టిన యువతి.. అంతలోనే చుట్టుముట్టిన కుక్కలు.. చివరకు ఏం జరిగిందంటే..

పల్లెలు మొదలుకొని పట్టణాలు, నగరాల వరకూ కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల కుక్కల దాడిలో చిన్నారులతో పాటూ చాలా మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎక్కడో చోటు కుక్క కాటు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అపార్ట్‌మెంట్స్‌లోకి అడుగుపెట్టగానే కొన్ని కుక్కలు ఆమెను చుట్టుముట్టాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఉన్న ఓ సోసైటీ అపార్ట్‪‌మెంట్స్ వద్ద ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి అపార్ట్‌మెంట్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ప్రహరీ గేటు తీసుకుని లోపలికి వెళ్లగానే అక్కడే ఉన్న కుక్కలు ఆమెను గమనించాయి. ముందుగా ఓ కుక్క ఆమెను చూసి మొరిగింది. దీంతో యువతి ఆ కుక్కను అదిలించింది. దాన్నుంచి తప్పించుకుని కాస్త ముందుకు వెళ్లగానే అక్కడే పడుకుని ఉన్న మరో రెండు కుక్కలు.. (dogs attacked on woman) యువతిపై దాడికి దిగుతాయి. చివరకు మూడు కుక్కలూ కలిసి ఆమెను వెంబడిస్తాయి.

Viral Video: ఇంత అందంగా ఉన్న ఈ యువతి.. అంతలోనే ఎలా భయపెట్టిందో చూడండి..

కుక్కలు మీదకు రావడంతో యువతి భయంతో గట్టిగా కేకలు పెడుతూ అక్కడి నుంచి బయటికి పరుగందుకుంది. అయితే అదృష్టవశాత్తు వాటి నుంచి తప్పించుకుని దూరంగా వెళ్లిపోతుంది. అంతలోనే అక్కడే ఉన్న సెక్యూరిటీతో పాటూ స్థానికులు అక్కడికి చేరుకుని కుక్కలను అదిలించి పక్కకు పంపిస్తారు. మొత్తానికి యువతికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కుక్కల దాడులు ఎక్కవయ్యాయి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఘటనలు జరగుకుండా చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. జనవరి 4న షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నాలుగు వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! ఇదేం బ్యాటింగ్‌రా బాబోయ్.. చూస్తుండగానే పిచ్‌పై నీరు వరదాలా ఎలా పారించాడో చూడండి..

Updated Date - Jan 07 , 2024 | 07:16 PM