Share News

Viral Video: జీతం పడలేదని భార్యాభర్తల వింత నిర్వాకం.. నేరుగా ఆఫీసుకు వెళ్లి వారు చేసిన నిర్వాకంతో..

ABN , Publish Date - Jan 07 , 2024 | 02:42 PM

దంపతుల మధ్య వివాహేతర సంబంధాలు, ఆర్థిక పరమైన విషయాల్లోనే ఎక్కువ సమస్యలు తలెత్తుతుంటాయి. చాలా మంది...

Viral Video: జీతం పడలేదని భార్యాభర్తల వింత నిర్వాకం.. నేరుగా ఆఫీసుకు వెళ్లి వారు చేసిన నిర్వాకంతో..

దంపతుల మధ్య వివాహేతర సంబంధాలు, ఆర్థిక పరమైన విషయాల్లోనే ఎక్కువ సమస్యలు తలెత్తుతుంటాయి. చాలా మంది భార్యలు డబ్బుల విషయంలో భర్తలను వేధిస్తుంటే.. ఇంకొంతమంది భార్యలను చిత్రహింసలు పెడుతుంటారు. అయితే తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. కొన్ని నెలలుగా జీతాలు పడకపోవడంతో భార్యాభర్తలకు కోపం వచ్చింది. నేరుగా ఆఫీసుకు వెళ్లి వారు చేసిన నిర్వాకంతో అంతా షాక్ అయ్యారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తు్న్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బండా జిల్లా మహువా బ్లాక్ పరిధిలోని ఖరద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రేఖ అనే మహిళ గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా (Sanitation worker) పని చేస్తో్ంది. అయితే కొన్ని నెలలుగా ఈమెకు జీతాలు రావడం లేదు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఈ విషయంలో పలుమార్లు పంచాయతీ సెక్రటరీ రోహిత్ పటేల్ అనే వ్యక్తితో మాట్లాడారు. అయినా జీతాలు మాత్రం రాలేదు. దీంతో చివరకు శాలరీ విషయంలో సెక్రటరీతో పలుమార్లు వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు సదరు మహిళ తన భర్తతో కలిసి పంచాయతీ ఆఫీసుకు వెళ్లింది. అక్కడ మళ్లీ జీతాల విషయంలో గొడవపడ్డారు.

Viral Video: పెళ్లిలో తాళి కట్టే ముందు వధువు చేయాల్సిన పనిని.. వరుడు చేయడంతో.. ఏం జరిగిందో చూడండి..

ఈ సారి వాగ్వాదం కాస్త పెద్ద గొడవకు దారి తీసింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న మహిళ భర్త.. సెక్రటరీపై చేయి చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. భర్తను వారించాల్సిన భార్య కూడా అందుకు విరుద్ధంగా సెక్రటరీపై దాడికి దిగింది. సెక్రటరీని ఇద్దరూ కలిసి నేలపై పడేసి కొడుతూనే ఉన్నారు. మహిళ తన చెప్పు తీసుకుని మరీ అతడిపై కొట్టింది. ఇంత జరుగుతున్నా అక్కడున్న వారు చోద్యం చూస్తున్నారు తప్ప.. విడిపించే ప్రయత్నం చేయలేదు. కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ భార్యాభర్తలు పెద్ద రౌడీల్లా ఉన్నారే’’.. అంటూ కొందరు, ‘‘ఇది మరీ దారుణం’’.. అంటూ ఇంకొందరు, ‘‘సామరస్యంగా మాట్లాడుకోవాలే గానీ.. ఇలా గొడవ చేయడం సరికాదు’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తు్న్నారు.

Viral Video: అరే..! వీడేంటీ యువతి వద్దకు వెళ్లి ఇంత పని చేశాడు.. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదో మీరే చెప్పండి..

Updated Date - Jan 07 , 2024 | 02:42 PM