Share News

Optical illusion: చేప కోసం వెతుకుతున్న ఎలుగుబంట్లు.. వాటి కంటే ముందే పసిగట్టారంటే.. మీరే కింగ్...

ABN , Publish Date - Jan 06 , 2024 | 03:41 PM

కొన్ని ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఎంతో ఏకాగ్రతగా పరిశీలిస్తే తప్ప అందులో దాగున్న రహస్యాన్ని కనిపెట్టలేం. పజిల్ చేయడం అంటే ఆసక్తి ఉన్న వారు...

Optical illusion: చేప కోసం వెతుకుతున్న ఎలుగుబంట్లు.. వాటి కంటే ముందే పసిగట్టారంటే.. మీరే కింగ్...

కొన్ని ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఎంతో ఏకాగ్రతగా పరిశీలిస్తే తప్ప అందులో దాగున్న రహస్యాన్ని కనిపెట్టలేం. పజిల్ చేయడం అంటే ఆసక్తి ఉన్న వారు ఇలాంటి వాటిపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం అనేక రకాల ఫజిల్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఫొటో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. అందులో కొన్ని ద్రువపు ఎలుగుబంట్లు చేప కోసం వెతుకుతుంటాయి. కానీ చేప మాత్రం వాటికి దొరక్కుండా దాక్కుని ఉంటుంది. ఈ ఫొటో చూసి చేప ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి..

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion photo) ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కొన్ని ద్రవపు ఎలుగుబంట్లు (Polar bears) ఓ చేప కోసం వెతుకుతున్నట్లుగా ఉంటాయి. కానీ చేప (fish) మాత్రం వాటికి దొరక్కుండా దాక్కుని ఉంటుంది. దానిని ఎలాగైనా తినేయాలని ఎలుగుబంట్లు వెతుకుతూ ఉంటాయి. అయితే ఈ ఫొటోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలుగు బంట్లు చేపను తినేశాయి.. కాబట్టి ఎక్కడా లేదు’’.. అంటూ కొందరు, ‘‘ఎలుగుబంట్ల కలర్‌లోనే ఎక్కడో దాక్కుని ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘చేపను కనుక్కోవడం చాలా కష్టంగా ఉందే’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోను బాగా గమనించి అందులో చేప ఎక్కడుందో గుర్తుపట్టేందుకు ప్రయత్నించిండి. ఒకవేళ మీ వల్ల సాధ్యం కాకపోతే.. చేప ఎక్కడుందో ఈ క్రింద ఇచ్చిన ఫొటోలో చూసేయండి.

viral-photos.jpg

Viral Video: ఇది రొమాంటిక్ కోతిలా ఉందే.. కారులో కూర్చున్న మహిళా కానిస్టేబుల్స్ వద్దకు వెళ్లి మరీ..

Updated Date - Jan 06 , 2024 | 03:41 PM