Share News

Wife: మీ కూతురు పారిపోయిందని చెప్పడంతో.. కంగారుగా అల్లుడి ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటి యజమానిని విచారించగా..

ABN , Publish Date - Jan 07 , 2024 | 09:10 PM

సుఖ సంతోషాల్లో, కష్టసుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసి, పెళ్లి చేసుకున్న కొందరు భర్తలు.. కొన్నిసార్లు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. సంతోషాన్ని పంచడం పక్కన పెడితే....

Wife: మీ కూతురు పారిపోయిందని చెప్పడంతో.. కంగారుగా అల్లుడి ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటి యజమానిని విచారించగా..
ప్రతీకాత్మక చిత్రం

సుఖ సంతోషాల్లో, కష్టసుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసి, పెళ్లి చేసుకున్న కొందరు భర్తలు.. కొన్నిసార్లు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. సంతోషాన్ని పంచడం పక్కన పెడితే నిత్యం చిత్రహింసలకు గురి చేస్తూ.. తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. అనుమానంతో కొందరు, డబ్బు ఆశతో ఇంకొందరు, పిల్లలు లేరని మరికొందరు భార్యలను వేధించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, బీహార్‌లో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ‘‘మీ కూతురు పారిపోయింది’’.. అంటూ అత్తమామలకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో కంగారుగా అల్లుడి ఇంటికి వచ్చిన వారికి.. షాకింగ్ వాస్తవం తెలిసింది. వివరాల్లోకి వెళితే...

బీహార్ (Bihar) ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక శివాయిపట్టి పోలీస్ స్టేషన్ పరిధి సాగరి బజార్‌ ప్రాంతానికి చెందిన పూజ అనే యువతికి (young woman), మీనూపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మోత్నాపూర్ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ సాహు అనే వ్యక్తికి 2021 డిసెంబర్‌లో వివాహమైంది. వివాహ సమయంలో జితేంద్ర కుమార్.. బైక్‌తో పాటూ రూ.5లక్షల నగదును కట్నం డిమాండ్ చేశాడు. జితేంద్ర తన భార్యతో కలిసి బైరియా బస్టాండ్ సమీపంలోని అద్దె ఇంట్లో ఉండేవాడు. ఇదిలావుండగా, వివాహం తర్వాత జితేంద్ర తన భార్యను కొన్నాళ్లు బాగానే చూసుకున్నాడు. అయితే తర్వాత రోజు రోజుకూ (husband tortures his wife) చిత్రహింసలు పెట్టడం మొదలెట్టాడు. పూజకు ఇంతవరకూ పిల్లలు పుట్టకపోవడంతో భర్తతో పాటూ అత్తమామలు కూడా వేధించడం మొదలెట్టారు.

Viral Video: అపార్ట్‌మెంట్స్‌లోకి అడుగుపెట్టిన యువతి.. అంతలోనే చుట్టుముట్టిన కుక్కలు.. చివరకు ఏం జరిగిందంటే..

women-crime.jpg

అలాగే పెళ్లిలో అడిగిన కట్నం వెంటనే తీసుకురావాంటూ భార్యపై తరచూ దాడి చేస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన జితేంద్ర.. తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత కేసు తన మీదకు రాకుండా ఉండేందుకు భార్య మృతదేహాన్ని బైకుపై ఎక్కించుకుని ఊరి బయటకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. తర్వాత పూజ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ‘‘మీ కూతురు ఎక్కడికి పారిపోయింది.. పొద్దున నుంచి కనిపించడం లేదు’’... అని చెప్పాడు. దీంతో కంగారుపడిన పూజ కుటుంబ సభ్యులు.. పరుగు పరుగున జితేంద్ర ఇంటికి చేరుకున్నారు. ఇంటి యజమానికి విచారించగా.. పూజను జితేంద్ర బైకులో తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో చివరకు పోలీసును ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: వామ్మో! ఇదేం బ్యాటింగ్‌రా బాబోయ్.. చూస్తుండగానే పిచ్‌పై నీరు వరదాలా ఎలా పారించాడో చూడండి..

Updated Date - Jan 07 , 2024 | 09:47 PM