Share News

Viral video: ప్రమాదం పొంచి ఉండడం అంటే ఇదేనేమో.. గోడౌన్‌లో మహిళ శుభ్రం చేస్తుండగా ఉన్నట్టుండి..

ABN , Publish Date - Mar 21 , 2024 | 06:59 PM

‘‘ఏ నిముషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు.. సడన్‌గా అనుకోని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి...

Viral video: ప్రమాదం పొంచి ఉండడం అంటే ఇదేనేమో.. గోడౌన్‌లో మహిళ శుభ్రం చేస్తుండగా ఉన్నట్టుండి..

‘‘ఏ నిముషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు.. సడన్‌గా అనుకోని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ గోడౌన్ శుభ్రం చేస్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని (Mumbai) వాషి ప్రాంతంలో ఉన్న ఏపీఎంసీ మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మార్కెట్‌లోని బియ్యం బస్తాల గోడౌన్‌లో ఓ మహిళ చీపురుతో శుభ్రం చేస్తోంది. అక్కడే చాలా బస్తాలు ఒకదానిమీద మరోటి పేర్చి ఉన్నాయి. బస్తాల మధ్యలో ఆమె శుభ్రం చేస్తుండగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ వైపు ఉన్న బస్తాల వరుస ఒక్కసారిగా (Sacks fell on the woman) కూలి ఆమె మీద పడింది. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మహిళపై చాలా బస్తాలు పడిపోవడంతో అంతా కలిసి వాటిని హుటాహుటిన పక్కకు తొలగించారు.

Viral video: ఏసీతో నీటి సమస్యకు చెక్.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న టెక్నిక్..

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బస్తాలు మీద పడడంతో చేయి కూడా విరిగినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘గోడౌన్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Women: డెలివరీ బాయ్‌ను వాష్ రూంలోకి తీసుకెళ్లిన మహిళ.. కాసేపటికి వంటగదిలోకి వెళ్లగా..

Updated Date - Mar 21 , 2024 | 06:59 PM