Share News

Women: డెలివరీ బాయ్‌ను వాష్ రూంలోకి తీసుకెళ్లిన మహిళ.. కాసేపటికి వంటగదిలోకి వెళ్లగా..

ABN , Publish Date - Mar 21 , 2024 | 04:23 PM

మహిళలు నిత్యం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరు కుటుంబ సభ్యుల నుంచి చిత్రహింసలు ఎదుర్కొంటుంటే.. మరికొందరు మహిళలు ఆకతాయిల నుంచి వేధింపులను ఎదుర్కొంటుంటారు. ఇంకొందరు మహిళలకు విచిత్ర అనుభవం ఎదురతుంటుంది. ఇలాంటి..

Women: డెలివరీ బాయ్‌ను వాష్ రూంలోకి తీసుకెళ్లిన మహిళ.. కాసేపటికి వంటగదిలోకి వెళ్లగా..
ప్రతీకాత్మక చిత్రం

మహిళలు నిత్యం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరు కుటుంబ సభ్యుల నుంచి చిత్రహింసలు ఎదుర్కొంటుంటే.. మరికొందరు మహిళలు ఆకతాయిల నుంచి వేధింపులను ఎదుర్కొంటుంటారు. ఇంకొందరు మహిళలకు విచిత్ర అనుభవం ఎదురతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అర్జెంట్ అని చెప్పడంతో ఓ మహిళ.. డెలివరీ బాయ్‌ని ఇంట్లోకి తీసుకెళ్లింది. కాసేపటి తర్వాత వంట గదిలోకి వెళ్లగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బెంగళూరుకు (Bangalore) చెందిన 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు (Software Engineer) షాకింగ్ అనుభవం ఎదురైంది. మార్చి 17న ఆమె ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ (online food Order) చేసింది. గంటల వ్యవధిలో డెలివరీ బాయ్.. పార్సిల్ తీసుకుని వచ్చాడు. ఆమె చేతికి పార్సిల్ ఇచ్చిన అతను.. వెళ్లిపోయే క్రమంలో అర్జంట్ అంటూ వాష్ రూమ్ వెళ్లాలని రిక్వెస్ట్ చేసుకున్నాడు. దీంతో ఆమె కూడా అతన్ని నమ్మి.. ఇంట్లోకి తీసుకెళ్లి వాష్‌రూమ్ చూపించింది. తర్వాత బయటికి వెళ్లిపోయే క్రమంలో మళ్లీ తాగడానికి నీళ్లు అడిగాడు. దీంతో ఆమె నీళ్లు తేవడానికి వంట గదిలోకి వెళ్లింది.

Viral video: పిల్లల్ని ఎత్తుకుని షాపింగ్ మాల్ వెళ్తున్నారా.. అయితే ఓసారి ఈ వీడియో చూడండి..

ఆమె వంటగదిలోకి వెళ్లగానే.. డెలివరీ బాయ్ వెనుకే లోపలికి వెళ్లాడు. వంటగదిలోకి వెళ్లగానే ఆమె చేయి పట్టుకుని, అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. డెలివరీ బాయ్ చేసిన నిర్వాకానికి ఆమె ఉలిక్కిపడి.. చివరికి అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని కేకలు వేసింది. దీంతో డెలివరీ బాయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంఘటన స్థలంలో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తు్న్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral: బెడ్రూంలో పెట్టెను శుభ్రం చేస్తుండగా భార్య కంటపడిన దుప్పట్లు.. చివరకు విచారించగా.. భర్త చేసిన నిర్వాకం..

Updated Date - Mar 21 , 2024 | 04:23 PM