Share News

Viral video: రోబోటిక్ డాగ్‌ను చూసి ఖంగుతిన్న కుక్క.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Mar 20 , 2024 | 03:43 PM

సోషల్ మీడియాలో రోబోటిక్ డాగ్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. రోబోటిక్ డాగ్‌ను తయారు చేసిన తర్వాత.. దాని పనితీరును పరీక్షించేందుకు ఏకంగా కుక్కల మీదే ప్రయోగించారు. పార్కులో ఉన్న కుక్కల వద్దకు రోబోటిక్ డాగ్‌ను వదిలారు. అది అచ్చం కుక్కలాగే పరుగెడుతూ...

Viral video: రోబోటిక్ డాగ్‌ను చూసి ఖంగుతిన్న కుక్క.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మనిషి మేథస్సు నుంచి పుట్టిన అనేక ఆవిష్కరణలు సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పొచ్చు. వీటిలో రోబోలు కూడా ముందు వరుసలో ఉన్నాయి. మనుషులతో పని లేకుండా చాలా పనులను రోబోలు.. చకచకా చేయడం చూస్తూ ఉన్నాం. అలాగే జంతువుల రోబోలు కూడా చిత్రవిచిత్ర పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, కుక్క రోబో వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. కుక్క ఎదురుగా వచ్చిన రోబోటిక్ డాగ్.. దానిలాగే ప్రవర్తిస్తూ షాక్ ఇచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో రోబోటిక్ డాగ్ వీడియో (Robotic dog viral video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. రోబోటిక్ డాగ్‌ను తయారు చేసిన తర్వాత.. దాని పనితీరును పరీక్షించేందుకు ఏకంగా కుక్కల మీదే ప్రయోగించారు. పార్కులో ఉన్న కుక్కల వద్దకు రోబోటిక్ డాగ్‌ను వదిలారు. అది అచ్చం కుక్కలాగే పరుగెడుతూ వాటి వద్దకు వెళ్లింది. రోబో డాగ్‌ను చూసిన ఓ కుక్క ఒక్కసారిగా ఖంగుతింది. ‘‘ఇదేంటీ..! అచ్చం నాలాగే ప్రవర్తిస్తున్నా.. ఏదో తేడాగా ఉందే’’.. అన్నట్లుగా రోబో వైపు చూస్తూ ఉండిపోతుంది.

Viral video: రైలు ఎక్కుతుండగా షాకింగ్ ట్విస్ట్.. తల్లి లోపల.. పిల్లాడు బయట.. చివరకు..

నిజమైన కుక్క ఎదురుగా వెళ్లిన రోబో డాగ్.. దానిలాగే ప్రవర్తిస్తూ భయపెడుతుంది. దీంతో ఉలిక్కిపడిన కుక్క అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. అయితే కుక్కను భయపట్టే క్రమంలో రోబోటిక్ డాగ్.. అదుపు తప్పి బోల్తా పడుతుంది. దీంతో కేవలం కాళ్లు మాత్రమే ఊపుతూ అలాగే ఉండిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఈ కుక్క రోబో భలే ఉందే’’.. అంటూ కొందరు, ‘‘చాలా బాగా అభివృద్ధి చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో ఓ తప్పు ఉంది.. దాన్ని కనిపెడితే మాత్రం మీరే జీనియస్..

Updated Date - Mar 20 , 2024 | 03:43 PM