Share News

Viral video: రైలు ఎక్కుతుండగా షాకింగ్ ట్విస్ట్.. తల్లి లోపల.. పిల్లాడు బయట.. చివరకు..

ABN , Publish Date - Mar 14 , 2024 | 01:32 PM

రైలు ప్రయాణ సమయాల్లో చాలా మంది తొందరపాటు కారణంగా చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరు ఎదుటివారిని ప్రమాదంలో పడేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా...

Viral video: రైలు ఎక్కుతుండగా షాకింగ్ ట్విస్ట్.. తల్లి లోపల.. పిల్లాడు బయట.. చివరకు..

రైలు ప్రయాణ సమయాల్లో చాలా మంది తొందరపాటు కారణంగా చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరు ఎదుటివారిని ప్రమాదంలో పడేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన పిల్లాడితో కలిసి రైలు ఎక్కుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బోగీ డోర్లు మూసుకుపోవడంతో తల్లి లోపల, పిల్లాడు బయట ఉండిపోయారు. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన పిల్లాడిని (Woman with child) వాకర్‌లో పెట్టుకుని రైల్వే స్టేషన్‌కి వెళ్తుంది. వాకర్‌ను తోసుకుంటూనే ప్లాట్‌ఫామ్ వద్దకు వెళ్తుంది. అయతే తీరా మెట్రో రైలు (Metro train) ఎక్కుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. బోగీ డోర్లు తెరుచుకోగానే ముందుగా ఆమె లోపలికి వెళ్లి.. తర్వాత పిల్లాడితో పాటూ వాకర్‌ను కూడా లోపలికి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే వాకర్ ముందు చక్రాలు బోగీ తలుపు కింద ఇరుక్కుపోవడంతో అది సాధ్యం కాదు. చూస్తుండగానే తలుపులు మూసుకుపోతాయి. దీంతో చేసేదేమీలేక ఆమె లోపలే ఉండిపోతుంది.

Viral: ఆ ఊరి బ్యాచిలర్లకు వింత కష్టం.. పెళ్లిళ్లు కాకపోవడానికి గల కారణం తెలిస్తే..

పిల్లాడు మాత్రం ప్లాట్‌ఫామ్‌లో వాకర్‌పై ఉండిపోతాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ నిరాశ్రయుడు గమనిస్తాడు. వెంటనే పైకి లేచి బాలుడి వద్దకు వెళ్తాడు. పిల్లాడిని తేరిపారా చూసి నవ్వించేందుకు ప్రయత్నిస్తాడు. వాకర్‌ను అటూ, ఇటూ తిప్పుతూ బాలుడు ముందు వింత వింతలా ప్రవర్తిస్తాడు. దీంతో పిల్లాడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడు. ఇలా ఆ పిల్లాడికి అతను రక్షణగా నిలుస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఇదే ఉదాహరణ’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా కెమెరాతో షూట్ చేశారు.. కాబట్టి ఇది నిజం కాదు’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 36 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వాహనదారులకు షాక్ ఇచ్చిన మహిళ.. ట్రాఫిక్ జామ్‌ను కూడా ఎలా సద్వినియోగం చేసుకుందంటే..

Updated Date - Mar 14 , 2024 | 01:32 PM