Share News

Viral video: పిల్లల్ని ఎత్తుకుని షాపింగ్ మాల్ వెళ్తున్నారా.. అయితే ఓసారి ఈ వీడియో చూడండి..

ABN , Publish Date - Mar 20 , 2024 | 05:36 PM

ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి షాపింగ్ మాల్‌కి వెళ్లాడు. ఏడాదిన్నర వయసున్న కొడుకును తండ్రి ఎత్తుకుని ఉండగా.. ఐదేళ్ల కొడుకు నడుస్తూ వెళ్లాడు. లోపల వారంతా ఎంతో సంతోషంగా గడిపారు. ఈ క్రమంలో..

Viral video: పిల్లల్ని ఎత్తుకుని షాపింగ్ మాల్ వెళ్తున్నారా.. అయితే ఓసారి ఈ వీడియో చూడండి..

తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని సమయంలో పిల్లలు ప్రమాదంలో పడిన సందర్భాలను చాలాసార్లు చూస్తుంటాం. అలాగే మరికొన్నిసార్లు దంపతుల అజాగ్రత్త, ఏమరపాటు వల్ల కూడా చిన్నారులు చిక్కుల్లో పడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విషాద ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం రాయ్‪‌పూర్‌లోని షాపింగ్ మాల్‌కి వెళ్లాడు. ఏడాదిన్నర వయసున్న కొడుకును తండ్రి ఎత్తుకుని ఉండగా.. ఐదేళ్ల కొడుకు నడుస్తూ వెళ్లాడు. లోపల వారంతా ఎంతో సంతోషంగా గడిపారు. ఈ క్రమంలో వారు మూడో అంతస్థుపైకి వెళ్లారు. అయితే అక్కడ ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎస్కలేటర్ ఎక్కే క్రమంలో వారి ఐదేళ్ల కొడుకు ముందుకు పరుగెత్తడంతో తండ్రి అతన్ని అడ్డుకోబోయాడు. చేత్తో పట్టుకుని పక్కకు లాగే ప్రయత్నంలో మరో చేతిలో ఉన్న ఏడాదిన్నర వయసు పిల్లాడు (boy fell from the third floor) జారిపోయి పైనుంచి కిందపడ్డాడు. పక్కన ఉన్న మరో వ్యక్తి పిల్లాడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

Viral video: రోబోటిక్ డాగ్‌ను చూసి ఖంగుతిన్న కుక్క.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

అంతా చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అంతా పరుగుపరుగున కిందకు వెళ్లి.. తీవ్రంగా గాయపడిన పిల్లాడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటిదాకా తన చేతిలోనే ఉన్న పిల్లాడు.. అలా ఉన్నట్టుండి మృతి ఒడిలోకి జారుకోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘చేజేతులా నిన్ను చంపుకొన్నానే’’.. అంటూ తండ్రి విలపించడం చూసి అక్కడున్న వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా తీవ్ర భావేద్వేగానికి గురవుతున్నారు. ‘‘అయ్యో..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘పిల్లల్ని తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పొరపాట్లు ఎవరూ చేయకండి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: అరే..! ఇదేం వింత టెక్నిక్.. మాంసం ముద్దను బావిలోకి విసరడంతో..

Updated Date - Mar 20 , 2024 | 05:42 PM