Share News

Viral Video: స్కూటీపై వెళ్తున్న యువకుడిపై అందరికీ అనుమానం.. సమీపానికి వెళ్లి చూడగా.. ఏకంగా ల్యాప్‌టాప్‌లో..

ABN , Publish Date - Mar 24 , 2024 | 06:56 PM

బైకులపై వెళ్తూ చిత్రవిచిత్ర పనులు చేసే వారిని చాలా మందిని చూశాం. రద్దీ రోడ్లపై బైకులో వెళ్తూనే ముద్దులు పెట్టుకునే ప్రేమికులు కొందరైతే.. మరికొందరు పరిమితికి మించి ప్రయాణిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా..

Viral Video: స్కూటీపై వెళ్తున్న యువకుడిపై అందరికీ అనుమానం.. సమీపానికి వెళ్లి చూడగా.. ఏకంగా ల్యాప్‌టాప్‌లో..

బైకులపై వెళ్తూ చిత్రవిచిత్ర పనులు చేసే వారిని చాలా మందిని చూశాం. రద్దీ రోడ్లపై బైకులో వెళ్తూనే ముద్దులు పెట్టుకునే ప్రేమికులు కొందరైతే.. మరికొందరు పరిమితికి మించి ప్రయాణిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తూ ల్యాప్‌టాప్‌లో చేస్తున్న పని చూసి అంతా ముక్కున వేసేసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులో (Bangalore) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. హెల్మెట్ పెట్టుకున్న ఆ వ్యక్తి.. ముందు వైపు ల్యాప్‌టాప్ పెట్టుకుని బండి డ్రైవ్ చేయడం చూసి అందరికీ అనుమానం కలిగింది. అతడి వెనుక మరో బైకుపై వెళ్తున్న వారికీ ఇదే సందేహం కలిగింది. దీంతో స్కూటీ సమీపానికి వెళ్లి చూడగా.. సదరు వ్యక్తి ల్యాప్‌టాప్‌లో జూమ్ కాల్ జాయిన్ అయినట్లు తెలిసింది.

Viral Video: ఏనుగుల మధ్య భీకర యుద్ధం.. అంతా చూస్తుండగానే.. చివరకు..

ఓ వైపు స్కూటీని డ్రైవ్ చేస్తూనే.. మరోవైపు జూమ్ యాప్‌లో సమాధానాలు ఇస్తున్నాడు. ఈ ఘటనను వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.40లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బైక్ ఇలాక్కూడా నడపొచ్చా.. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి బ్రో..

Updated Date - Mar 24 , 2024 | 06:56 PM