Share News

Viral Video: ఎగ్జిబిషన్‌లోకి ఇలాక్కూడా ఎంట్రీ ఇవ్వొచ్చా.. వీళ్ల తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే...

ABN , Publish Date - Mar 22 , 2024 | 06:07 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులంతా కలిసి ఎగ్జిబిషన్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. అయితే ఎంట్రీ టికెట్ రూ.20 ఉండడంతో.. ఎలాగైనా ఫ్రీగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఓ టికెట్ అయితే కొన్నారు. తర్వాత...

Viral Video: ఎగ్జిబిషన్‌లోకి ఇలాక్కూడా ఎంట్రీ ఇవ్వొచ్చా.. వీళ్ల తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే...

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని కొందరు సద్వినియోగం చేసుకుంటుంటే.. మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కొందరైతే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా మోసాలకు పాల్పడడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎగ్జిబిషన్‌లోకి ఫ్రీగా వెళ్లేందుకు కొందరు యువకులు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులంతా కలిసి ఎగ్జిబిషన్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. అయితే ఎంట్రీ టికెట్ రూ.20 ఉండడంతో.. ఎలాగైనా ఫ్రీగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఓ టికెట్ అయితే కొన్నారు. తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లి.. అచ్చం దాని మాదిరే చాలా టికెట్లను ఫ్రింట్ చేశారు. చివరగా వాటిని తీసుకుని ఎగ్జిబిషన్ వద్దకు వచ్చారు. యువకులంతా కలిసి ఆ టికెట్లు చూపించి, వరుసగా లోపలికి వెళ్లారు.

Viral video: అమ్మాయిల పార్టీలోకి సడన్‌గా ఎంటరైన ఆవు.. ఫైనల్‌గా వారికి ఎలాంటి షాక్ ఇచ్చిందంటే..

లోపలికి వెళ్లాక వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధించేశాం.. అన్నట్లుగా వీడియోలకు ఫోజులు ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దొంగనోట్లు చూశాం గానీ.. దొంగ టికెట్లు కూడా చేస్తున్నారా’’.. అంటూ కొందరు, ‘‘వీళ్ల తెలివితేటలు తగలెయ్య’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: వామ్మో..! ఈ అమ్మాయిలేంటీ.. మరీ ఇలా తయారయ్యారు.. నడిరోడ్డుపై వీళ్ల చేష్టలు చూస్తే..

Updated Date - Mar 22 , 2024 | 06:11 PM