Share News

Viral video: వామ్మో..! ఈ అమ్మాయిలేంటీ.. మరీ ఇలా తయారయ్యారు.. నడిరోడ్డుపై వీళ్ల చేష్టలు చూస్తే..

ABN , Publish Date - Mar 22 , 2024 | 05:12 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువకులతో పాటూ కొందరు యువతులు కూడా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. కొందరు నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ప్రేమికులు నడి రోడ్డుపై రచ్చరచ్చ చేయడం కూడా చూస్తున్నాం. ఇంకొందరు...

Viral video: వామ్మో..! ఈ అమ్మాయిలేంటీ.. మరీ ఇలా తయారయ్యారు.. నడిరోడ్డుపై వీళ్ల చేష్టలు చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువకులతో పాటూ కొందరు యువతులు కూడా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. కొందరు నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ప్రేమికులు నడి రోడ్డుపై రచ్చరచ్చ చేయడం కూడా చూస్తున్నాం. ఇంకొందరు యువతులైతే ఫుల్‌గా మద్యం తాగి అంతా అవాక్కయ్యేలా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు యువతులు ఫుల్‌గా మందు తాగి నడి రోడ్డుపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అంబికాపూర్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బనారస్ రోడ్డులోని బారియర్ వద్ద ఇద్దరు యువతులు చేసిన నిర్వాకం అంతా అవాక్కయ్యేలా చేసింది. ఫుల్‌గా మందు తాగి బైకుపై (drunken girls) వచ్చిన యువతులు.. బైకును రోడ్డు పక్కన ఆపారు. మద్యం మత్తులో ఉన్న వారు ఏం చేస్తున్నారో వారికే తెలీనంతలా ప్రవర్తించారు. ఒకరినొకరు తోసుకుంటూ, కేకలు వేస్తూ వర్షంలో హల్‪‌చల్ చేశారు. బురదలో అటూ ఇటూ పొర్లుతూ బూతులు తిట్టుకున్నారు. తర్వాత ఓ యువతి మరో యువతిని పైకి ఎత్తి కిందపడేసింది. వీరి నిర్వాకానికి అక్కడున్న వాహనదారులంతా అవాక్కయ్యారు.

Viral video: ప్రమాదం పొంచి ఉండడం అంటే ఇదేనేమో.. గోడౌన్‌లో మహిళ శుభ్రం చేస్తుండగా ఉన్నట్టుండి..

ఇదిలావుండగా, 24 గంటల్లోనే దరిమా అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఫుల్‌గా మద్యం సేవించి, రోడ్డుపై రచ్చరచ్చ చేసింది. దీంతో జనం చుట్టూ చేరి ఆమెను విచిత్రంగా చూడసాగారు. ఇంతలో ఓ వ్యక్తి కలుగజేసుకుని ఆమెను పట్టుకుని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తో్ంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ అమ్మాయిలేంటీ.. మరీ ఇంత ఓవర్ చేస్తున్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వాళ్లను చూసి మిగతా వాళ్లు కూడా చెడిపోతున్నారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: అమ్మాయిల పార్టీలోకి సడన్‌గా ఎంటరైన ఆవు.. ఫైనల్‌గా వారికి ఎలాంటి షాక్ ఇచ్చిందంటే..

Updated Date - Mar 22 , 2024 | 05:12 PM