Share News

Viral video: అమ్మాయిల పార్టీలోకి సడన్‌గా ఎంటరైన ఆవు.. ఫైనల్‌గా వారికి ఎలాంటి షాక్ ఇచ్చిందంటే..

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:58 PM

వినోదం, వింతలు, విశేషాలు.. ఇలా అన్నింటికీ సోషల్ మీడియాలో వేదికగా మారుతోంది. రోజూ కుప్పలుతెప్పలుగా కనిపించే వీడియోల్లో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలను చూస్తే నవ్వు వస్తుంటుంది. తాజాగా..

Viral video: అమ్మాయిల పార్టీలోకి సడన్‌గా ఎంటరైన ఆవు.. ఫైనల్‌గా వారికి ఎలాంటి షాక్ ఇచ్చిందంటే..

వినోదం, వింతలు, విశేషాలు.. ఇలా అన్నింటికీ సోషల్ మీడియాలో వేదికగా మారుతోంది. రోజూ కుప్పలుతెప్పలుగా కనిపించే వీడియోల్లో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలను చూస్తే నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు అమ్మాయిలు పార్టీ చేసుకుంటుండగా.. సడన్‌గా ఓ ఆవు అక్కడికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొందరు అమ్మాయిలంతా కలిసి ఆహ్లాదకరమైన (Girls partying) వాతావరణంలో పార్టీ చేసుకుంటున్నారు. చల్లటి గాలి మధ్య నేలసై చాప పరిచి, అందులో వివిధ రకాల ఆహార పదార్థాలను ఉంచి తినడం స్టార్ట్ చేశారు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పార్టీ మొదలవుతుండగా సడన్‌గా ఓ ఆవు (cow) అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. ‘‘అమ్మాయిలూ..! మాకు లేదా పార్టీ’’.. అన్నట్లుగా వారి వైపు చూస్తూ ఆహార పదార్థాల వద్దకు వస్తుంది. ఆవు రావడాన్ని చూసి వారంతా భయంతో పక్కకు పారిపోతారు.

Viral video: విమానం కూలిపోవడానికి ముందు.. సెకన్ల వ్యవధిలో షాకింగ్ సీన్... చివరకు..

ఆహార పదార్థాల వద్దకు వెళ్లిన ఆవు.. ఎంచక్కా, అన్ని ప్లేట్లలోని ఆహారాన్ని లాగించేస్తుంది. పారిపోయిన యువతులంతా దూరం నుంచి ఆవును చూస్తూ ఉండిపోతారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఆవు భలే విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘పార్టీకి పిలవలేదని.. కోపం వచ్చినట్లుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Women: డెలివరీ బాయ్‌ను వాష్ రూంలోకి తీసుకెళ్లిన మహిళ.. కాసేపటికి వంటగదిలోకి వెళ్లగా..

Updated Date - Mar 22 , 2024 | 03:58 PM