Share News

Viral Video: కుక్క పదే పదే విసిగిస్తోందని.. ఈ పిల్లాడు చేసిన పని చూడండి..

ABN , Publish Date - Mar 23 , 2024 | 08:28 PM

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. కొన్నిసార్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. వివిధ కారణాల వల్ల కొన్ని కుక్కలు చిన్న పిల్లలు, వృద్ధులపై దాడులు చేసి చంపేసిన ఘటనలు కూడా చాలా చూశాం. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో...

Viral Video: కుక్క పదే పదే విసిగిస్తోందని.. ఈ పిల్లాడు చేసిన పని చూడండి..

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. కొన్నిసార్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. వివిధ కారణాల వల్ల కొన్ని కుక్కలు చిన్న పిల్లలు, వృద్ధులపై దాడులు చేసి చంపేసిన ఘటనలు కూడా చాలా చూశాం. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా, కుక్కకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుక్క పదే పదే విసిగిస్తోందని, ఓ పిల్లాడు దానికి గట్టి షాక్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ బుడ్డోడి కోపం మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు బ్యాగు తీసుకుని ఇంటి బయట ఉన్న ఆటోలో వేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన పెంపుడు కుక్క పిల్లాడిని బ్యాగు వేయకుండా అడ్డుకుంటుంది. బ్యాగును ఆటోలే వేయాలని ప్రయత్నించినప్పుడల్లా.. పిల్లాడిని అడ్డుకుంటుంది. దీంతో బుడ్డోడికి చివరికి చిర్రెత్తుకొస్తుంది. ‘‘ఎహే.. ఏంటీ నీ నస’’.. అన్నట్లుగా (boy bit the dog) కుక్క చెవిని పట్టుకుని గట్టిగా కొరికేస్తాడు.

Viral Video: ఏనుగుల గురించి తెలిసి కూడా అలాంటి తప్పే చేశాడు.. చివరికి దాని రియాక్షన్ ఏంటంటే..

పిల్లాడు కొరికేయడంతో కుక్క నొప్పిని భరించలేక.. కెవ్వుమని మొరుగుతుంది. ఈ ఘటన చూసి అక్కడే ఉన్న వారు నవ్వుకుంటూ ఉంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బోడ్డోడి ఆవేశం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో పిల్లలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 98వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కారు పార్కింగ్‌కు స్థలం లేదని చింతిస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే..

Updated Date - Mar 23 , 2024 | 08:28 PM