Share News

Viral Video: కారు పార్కింగ్‌కు స్థలం లేదని చింతిస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే..

ABN , Publish Date - Mar 22 , 2024 | 09:14 PM

తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు.. అన్నట్లుగా మనమే తెలివిగలవారమని అనుకుంటే.. అంతకు మించి తెలివిగా ఆలోచించే వారు ఎదురవుతుంటారు. కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వారు చేసే వింత వింత ప్రయోగాలు చూసినప్పుడు..

Viral Video: కారు పార్కింగ్‌కు స్థలం లేదని చింతిస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే..

తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు.. అన్నట్లుగా మనమే తెలివిగలవారమని అనుకుంటే.. అంతకు మించి తెలివిగా ఆలోచించే వారు ఎదురవుతుంటారు. కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వారు చేసే వింత వింత ప్రయోగాలు చూసినప్పుడు.. ‘‘ఎలా వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వినూత్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కారును పార్కింగ్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో తన ఇంటికి వద్దకు వస్తాడు. అయితే ఇంటి ముందు కారు పార్క్ (Car parking) చేసేందుకు స్థలం ఉండదు. కానీ అతను గేటు ముందు కారు ఆపి పార్క్ చేసేందుకు సిద్ధమవుతాడు. ఇందుకోసం అతను కారు దిగి వచ్చి ఇంటి పక్కన మెట్ల కింద ఉన్న గేటును తెరుస్తాడు. లోపల అప్పటికే కారుకు సరిపోయే విధంగా సిద్ధం చేసి పెట్టుకున్న చక్రాల ఇనుప స్టాండ్‌ను పట్టుకుని బయటికి లాగుతాడు. ఆ తర్వాత కారును రివర్స్‌లో ఆ స్టాండ్‌పైకి ఎక్కిస్తాడు.

Optical illusion: ఎండిపోయిన ఈ చెట్టుపై 5 పక్షులు ఉన్నాయి.. ఎక్కడున్నాయో చెప్పారంటే మీరు గ్రేట్..

చివరగా కారును బీరువాలో బాక్సు పెట్టినంత సులువుగా లోపలికి తోసేస్తాడు. ఫైనల్‌గా గేటు మూయడంతో అంతా మామూలుగా మారిపోతుంది. కారు ఏటవాలుగా ఉంచితే మెట్ల కింద సరిగ్గా సరిపోయేలా ఏర్పాట్లు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇంత తక్కువ స్థలంలో కారు పార్కింగ్ చేయడం గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Lovers: ప్రియురాలితో ఏకాంతంగా ఉండగా సడన్‌గా మోగిన ఫోన్.. ఎవరో అని తొంగిచూసిన యువతి.. చివరకు..

Updated Date - Mar 22 , 2024 | 09:18 PM