Share News

Lovers: ప్రియురాలితో ఏకాంతంగా ఉండగా సడన్‌గా మోగిన ఫోన్.. ఎవరో అని తొంగిచూసిన యువతి.. చివరకు..

ABN , Publish Date - Mar 22 , 2024 | 08:35 PM

ప్రేమికుల మధ్య కొన్నిసార్లు చిత్రవిచిత్ర సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరు చిన్న చిన్న కారణాలకు పెద్ద పెద్ద గొడవలు చేస్తూ అంతా షాక్ అయ్యేలా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు లేనిపోని అనుమానాలతో ప్రేమించిన వారిపై దాడులకు తెగబడుతుంటారు. ఇలాంటి వార్తలు ...

Lovers: ప్రియురాలితో ఏకాంతంగా ఉండగా సడన్‌గా మోగిన ఫోన్.. ఎవరో అని తొంగిచూసిన యువతి.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమికుల మధ్య కొన్నిసార్లు చిత్రవిచిత్ర సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరు చిన్న చిన్న కారణాలకు పెద్ద పెద్ద గొడవలు చేస్తూ అంతా షాక్ అయ్యేలా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు లేనిపోని అనుమానాలతో ప్రేమించిన వారిపై దాడులకు తెగబడుతుంటారు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో అతడి ఫోన్ మోగింది. దీంతో ఎవరో అని ప్రియురాలు తొంగిచూసింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ప్రేమ జంటకు సంబంధించిన వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నిగోహా గ్రామానికి చెందిన యువకుడు.. ఇదే గ్రామానికి చెందిన యువతిని కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నాడు. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. అయితే ఇటీవల వారిద్దరూ కలిసి ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు అర్ధరాత్రి సమయంలో ప్రియురాలిని కలిసేందుకు అతను ఏకంగా ఆమె సోదరి ఇంటికే వెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రియుడికి ఫోన్‌కు గుర్తు తెలియని మహిళ నుంచి కాల్ వచ్చింది. ఎవరో అని అతడి ఫోన్ వైపు తొంగిచూసిన యువతి.. చివరికి అవతలి వైపు నుంచి వినిపించిన మహిళ గొంతు విని తీవ్ర ఆగ్రహానికి గురైంది.

Viral Video: ఎగ్జిబిషన్‌లోకి ఇలాక్కూడా ఎంట్రీ ఇవ్వొచ్చా.. వీళ్ల తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే...

ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఫోన్ చేసిన మహిళ ఎవరో తనకు తెలీదని అతను ఎంత చెబుతున్నా.. ఆమె వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా వంట గదిలోకి వెళ్లి ఇనుప రాడ్ తీసుకుని (Girlfriend attacked her boyfriend) వచ్చి ప్రియుడిని చితకబాదింది. అక్కడి నుంచి పారిపోయిన ప్రియుడు.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. తాను గత ఆదివారం కొత్త ఫోన్ కొన్నానని, ఈ తర్వాత ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాలని పోలీసు విచారణలో తెలిపాడు. తనకు ఫోన్ చేసిన మహిళ ఎవరో తెలీదని, ఇదే విషయం చెబుతున్నా వినకుండా తనపై ప్రియురాలు దాడి చేసిందంటూ వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Optical illusion: ఎండిపోయిన ఈ చెట్టుపై 5 పక్షులు ఉన్నాయి.. ఎక్కడున్నాయో చెప్పారంటే మీరు గ్రేట్..

Updated Date - Mar 22 , 2024 | 08:35 PM