Share News

Viral Video: ఏనుగుల మధ్య భీకర యుద్ధం.. అంతా చూస్తుండగానే.. చివరకు..

ABN , Publish Date - Mar 24 , 2024 | 05:53 PM

జనారణ్యంలో జంతువులు బీభత్సం సృష్టించడం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు చివరకు విషాదాంతం అవుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఏనుగులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: ఏనుగుల మధ్య భీకర యుద్ధం.. అంతా చూస్తుండగానే.. చివరకు..

జనారణ్యంలో జంతువులు బీభత్సం సృష్టించడం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు చివరకు విషాదాంతం అవుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఏనుగులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కేరళలో రెండు ఏనుగుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అంతా చూస్తుండగానే ఒకదానిపై ఒకటి దాడికిదిగాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కేరళ (Kerala) త్రిస్సూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక అరట్టుపుజ గ్రామంలోని థారక్కల్ ఆలయంలో శుక్రవారం రాత్రి ఉత్సవ విగ్రహాల ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఉత్సవ విగ్రహాలను ఏనుగుపై ఊరేగిస్తున్న (procession on elephants) క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏమైందో ఏమోగానీ ఉన్నట్టుండి ఓ ఏనుగు మరో ఏనుగుపై దాడికి దిగింది. ఈ క్రమంలో రెండు ఏనుగులు ఒకదాని మరొకటి తోసుకుంటూ బీభత్సం సృష్టించాయి.

Viral Video: బైక్ ఇలాక్కూడా నడపొచ్చా.. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి బ్రో..

మధ్యలో వాటిలో ఓ ఏనుగు చాలా దూరం పరుగెత్తడంతో జనం భయాందోళనకు గురయ్యారు. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఏనుగులను నియంత్రించడానికి వచ్చిన మావటి శ్రీకుమార్‌పై దాడి చేయడంతో గాయాలయ్యాయి. చివరకు ఎలిఫెంట్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని వాటిని నియంత్రించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో మావటితో పాటూ మరికొంత మంది భక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కారు పార్కింగ్‌కు స్థలం లేదని చింతిస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే..

Updated Date - Mar 24 , 2024 | 05:53 PM