Share News

Crime News : నా భర్తను చంపితే రూ.50 వేలు ఇస్తా.. సంచలనంగా మారిన వాట్సాప్ స్టేటస్..

ABN , Publish Date - Apr 01 , 2024 | 07:57 AM

వాట్సాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టేటస్ పెట్టే వారి సంఖ్య పెరిగిపోతోంది. మూడ్ స్వింగ్స్ కు తగ్గట్టు లేటేస్టే అప్డేట్స్ ను స్టేటస్ లో షేర్ చేస్తుంటారు. ఆనందమైనా, బాధైనా ఇలా ఏదైనా కాదేదీ స్టేటస్ కు అనర్హం అన్నట్లు నిత్యం సోషల్ మీడియాలో గడిపేస్తుంటారు మరికొందరు. స్టేటస్ లు అందరూ చూస్తారు. అందరూ పెడతారు.

Crime News : నా భర్తను చంపితే రూ.50 వేలు ఇస్తా.. సంచలనంగా మారిన వాట్సాప్ స్టేటస్..

వాట్సాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టేటస్ పెట్టే వారి సంఖ్య పెరిగిపోతోంది. మూడ్ స్వింగ్స్ కు తగ్గట్టు లేటేస్టే అప్డేట్స్ ను స్టేటస్ లో షేర్ చేస్తుంటారు. ఆనందమైనా, బాధైనా ఇలా ఏదైనా కాదేదీ స్టేటస్ కు అనర్హం అన్నట్లు నిత్యం సోషల్ మీడియాలో గడిపేస్తుంటారు మరికొందరు. స్టేటస్ లు అందరూ చూస్తారు. అందరూ పెడతారు. కానీ కొంతమంది పెట్టే స్టేటస్ లు ఫన్నీగా ఉంటే మరికొందరి స్టేటస్ లు మాత్రం సంచలనంగా మారుతుంటాయి. ప్రస్తుతం అలాంటి ఘటనే ఆగ్రా ( Agra ) లో జరిగింది. ఓ మహిళ తమ భర్తను చంపేయాలని, ఈ పని చేసిన వారికి రూ.50 వేలు ఇస్తానంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ఈ ఘటన సంచలనంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయక తప్పలేదు.

Telangana: హామీలు అమలు చేయాలంటే.. కాంగ్రెస్ కు చురకలంటించాలి.. హరీశ్ రావు..

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో నివాసం ఉంటున్న ఓ జంట 2022లో వివాహం చేసుకున్నారు. వారి మధ్య సఖ్యత లేక కొన్నాళ్లకే మనస్పర్థలు వచ్చాయి. కేవలం ఐదు నెలలకే వారిద్దరూ దూరమయ్యారు. దాంతో భార్య పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటోంది. తన భర్త వేధిస్తున్నాడని, అతనని చంపేయాలంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టింది. చంపిన వారికి రూ.50 వేలు కూడా ఇస్తానని చెప్పింది. ఈ స్టేటస్ చూసిన భర్త తీవ్ర భయాందోళనకు గురై తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు. రక్షించాలని ప్రాధేయపడ్డాడు.


Andhra Pradesh 2024: నోరు అదుపులో పెట్టుకోండి.. నేనేంటో చూపిస్తా కొడకల్లారా..

తమ మధ్య వచ్చిన వివాదాలకు తన అత్తమామల పక్కింట్లో ఉంటున్న వ్యక్తే కారణమని బాధితుడు ఆరోపించాడు. అతనితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని వెల్లడించాడు. అతడు తనకు చాలా సార్లు ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడని పోలీసులు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 07:57 AM