Share News

Telangana: హామీలు అమలు చేయాలంటే.. కాంగ్రెస్ కు చురకలంటించాలి.. హరీశ్ రావు..

ABN , Publish Date - Mar 31 , 2024 | 04:10 PM

కాంగ్రెస్ పై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు ( Harish Rao ) స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Telangana: హామీలు అమలు చేయాలంటే.. కాంగ్రెస్ కు చురకలంటించాలి.. హరీశ్ రావు..

కాంగ్రెస్ పై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు ( Harish Rao ) స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు చురకలింటేస్తేనే హామీలన్నీ అమలవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే త్వరలో జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో గుడుంబా ఏరులై పారుతోందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకి కన్నీళ్లు తెచ్చిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా భవిష్యత్ కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

Telangana: ఒక్కో ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి.. మాజీ మంత్రి పువ్వాడ..

కేసీఆర్ పాలనలో జిల్లాలు చేస్తే రేవంత్ రెడ్డి అ జిల్లాలని తీసేయాలని చూస్తున్నారు. ఫేక్, లీక్, జూటా మాటలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేస్తూ జైలుకు పంపిస్తామని బెదిరిస్తోంది. ఇప్పటికీ అమర వీరులకు నివాళులు అర్పించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీని మోసం చేసి పార్టీ మారిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోం. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.

- హరీశ్ రావు, మాజీ మంత్రి


Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

మరోవైపు.. కేశవరావుకు బీఆర్ఎస్ రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా అవకాశమిచ్చిందని.. ఆయన కూతురికి మేయర్‌ పదవి, కుమారుడికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు సైతం ఇచ్చిందని హరీశ్ రావు అన్నారు. పార్టీలో పెద్ద మనిషిగా కేకేకు కేసీఆర్‌ ఎప్పుడూ గౌరవం ఇచ్చే వారన్నారు. కష్ట కాలంలో పార్టీని వదిలిపోవడం దురదృష్టకరం అని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 31 , 2024 | 04:12 PM