Share News

Telangana: ఒక్కో ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి.. మాజీ మంత్రి పువ్వాడ..

ABN , Publish Date - Mar 31 , 2024 | 01:42 PM

కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, నదులు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. దూరదృష్టితో ఆయన చేసిన పనుల వల్లే రాష్ట్రం పదేళ్లు సుభిక్షంగా ఉందని, కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టి 4 నెలలయినా కాకముందే రాష్ట్రంలో కరవు ఛాయలు అలుముకున్నాయని విమర్శించారు.

Telangana: ఒక్కో ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి.. మాజీ మంత్రి పువ్వాడ..

కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, నదులు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. దూరదృష్టితో ఆయన చేసిన పనుల వల్లే రాష్ట్రం పదేళ్లు సుభిక్షంగా ఉందని, కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టి 4 నెలలయినా కాకముందే రాష్ట్రంలో కరవు ఛాయలు అలుముకున్నాయని విమర్శించారు. ప్రభుత్వ చేతగాని తనం వల్ల నీరు లేక, పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నాగార్జున సాగర్ లో ఉన్న నీళ్లను తాగునీటిగా తీసుకోలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికే కాదు తాగేందుకూ నీరు లేదని మండిపడ్డారు. మార్చిలోనే ఈ సమస్య ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో నీటి ఎద్దడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వివరించారు.

ఒక్క నీటి సమస్యే కాదు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇంతవరకు రైతులకు రైతు బంధు నగదు జమ కాలేదు. రైతులకు ఎకరానికి రూ.30 వేలు పంట నష్టం ఇవ్వాలి. మిషన్ భగీరథ నీటిపై ఆధారపడి ఖమ్మం నగర ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు నిల్వ ఉన్న నీరు కేవలం వారం రోజులకే సరిపోతాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి. ఖమ్మం బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి నామనాగేశ్వర రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.

- పువ్వాడ అజయ్, మాజీ మంత్రి

Trending News: ఈ దేశంలో అసలు నేరాలే జరగవట.. ఆయుధాలు ఉన్నా ఉపయోగించరట.. !


మరోవైపు.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామదేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రోడ్డు పక్కనే ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. నీటి ఇబ్బందుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ సూర్యాపేటలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు సూర్యాపేట పార్టీ ఆఫీస్‌లో ప్రెస్ మిట్ నిర్వహిస్తారు. 4 గంటలకు సాగర్ ఆయకట్టులో ఎండిన పొలాలను పరిశీలించి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరతారు.

Dwarka: దేవభూమి ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు దుర్మరణం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 31 , 2024 | 01:42 PM