Share News

Trending News: స్కూల్ ఫెయిల్ చెస్తే కోర్టు పాస్ చేసింది.. అసలు కథేంటంటే..

ABN , Publish Date - Apr 07 , 2024 | 02:28 PM

దేశ రాజధాని దిల్లీ ( Delhi ) లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థిని ఆరో తరగతికి ప్రమోట్ చేయడానికి పాఠశాల నిరాకరించంది. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

Trending News: స్కూల్ ఫెయిల్ చెస్తే కోర్టు పాస్ చేసింది.. అసలు కథేంటంటే..

దేశ రాజధాని దిల్లీ ( Delhi ) లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థిని ఆరో తరగతికి ప్రమోట్ చేయడానికి పాఠశాల నిరాకరించంది. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ సి.హరిశంకర్ ధర్మాసనం విద్యార్థి చదువుకు ఆటంకం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోలేమని, చదువు దెబ్బతింటే కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని వెల్లడించింది. దీనిని పూడ్చలేమని పేర్కొంది. పిల్లవాడ్ని పై తరగతికి అనుమతిస్తే అది పాఠశాలపై ఎలాంటి ప్రభావం చూపిందని స్పష్టం చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రైవేట్ స్కూల్, విద్యా డైరెక్టరేట్‌లను కోర్టు ఆదేశించింది. ఈ కేసు జూలై 4న విచారణకు రానుంది.


Congress: పాకిస్తాన్ కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో.. సీఎం ఘాటు వ్యాఖ్యలు..

పిటీషన్ ప్రకారం.. బాధిత విద్యార్థి 2023-24 సంవత్సరంలో అలకనందలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఫలితాలు వెల్లడించకుండా మరో సారి మార్చి 6, 18 తేదీల్లో మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయినట్లు ప్రకటించి ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు స్కూల్ యాజమాన్యం నిరాకరించింది.


Ayodhya: డిసెంబర్ నాటికి అచ్చెరువొందేలా అయోధ్య.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

మొదటి సారి తాను రాసిన పరీక్ష ఫలితాలు వెల్లడించకుండా పునఃపరీక్షకు సమయం ఇవ్వకుండా ఎగ్జామ్ పెట్టారని బాధితులు కోర్టుకు తెలిపారు. ప్రిపరేషన్ కు సమయం ఇవ్వకపోవడం వల్లే తాను ఫెయిల్ అయినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించిన న్యాయస్థానం విద్యార్థినిని ఆరో తరగతికి ప్రమోట్ చేయాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో విద్యార్థితో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 07 , 2024 | 02:33 PM