Share News

Ayodhya: డిసెంబర్ నాటికి అచ్చెరువొందేలా అయోధ్య.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:54 AM

రాఘవుడు నడయాడిన నేలగా ఖ్యాతి గడించిన అయోధ్యలో బాల రాముడు కొలువయ్యాడు. రామ్ లల్లాను చూసేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ట్రస్టు కీలక ప్రకటన చేసింది.

Ayodhya: డిసెంబర్ నాటికి అచ్చెరువొందేలా అయోధ్య.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

రాఘవుడు నడయాడిన నేలగా ఖ్యాతి గడించిన అయోధ్యలో ( Ayodhya Ram Mandir ) బాల రాముడు కొలువయ్యాడు. రామ్ లల్లాను చూసేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ట్రస్టు కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నాటికి రామ మందిరం మొదటి అంతస్తులో రామ్ దర్బార్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఎల్ అండ్ టీ టాటా కన్సల్టెన్సీతో పాటు ప్రభుత్వ నిర్మాణ సంస్థ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. రామాలయ నిర్మాణ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వెయ్యేళ్లు భద్రంగా ఉండే రామమందిరం మొదటి అంతస్తుతో పాటు ఆలయ చుట్టుకొలత చుట్టూ 795 మీటర్ల పొడవైన ప్రాకార నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


Visakhapatnam: విశాఖపట్నం - అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‍కు తప్పిన పెను ప్రమాదం

నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆలయ మొదటి అంతస్తులో రామ్ దర్బార్ ఏర్పాటుతో పాటు రెండో అంతస్తునూ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం సప్త మండపం నిర్మాణానికి బీమ్‌ పనులు ప్రారంభించినట్లు నృపేంద్ర తెలిపారు. రాంలల్లా ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు వీలుగా 795 మీటర్లు పొడవైన ప్రాకారం నిర్మిస్తున్నారు. రామ మందిర నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఛైర్మన్ నృపేంద్ర తెలిపారు.


Elections 2024: భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన రాజకీయం.. ఆ కారణంతో దూరం..

ఈ సమావేశంలో ఎల్ అండ్ టీ టాటాతో పాటు ప్రభుత్వ నిర్మాణ సంస్థ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. రామనవమి రోజున సూర్యకిరణాలు మూలవిరాట్ పై పడే విధంగా నిర్మాణం చేయడానికి రూర్కీ నుంచి శాస్త్రవేత్తలు వచ్చారు. పనులు పూర్తయితే ఏటా రామనవమి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించనున్నాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 07 , 2024 | 10:54 AM