Share News

BJP: ఆరాచకవాదులకు అడ్డాగా ఆ పార్టీ.. ఆప్ పై బీజేపీ విసుర్లు

ABN , Publish Date - Mar 22 , 2024 | 08:44 AM

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై బీజేపీ ( BJP ) తీవ్ర స్థాయిలో మండిపడింది. కేజ్రీవాల్ సహకారం, అనుమతితోనే మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందని ఆరోపించింది.

BJP: ఆరాచకవాదులకు అడ్డాగా ఆ పార్టీ.. ఆప్ పై బీజేపీ విసుర్లు

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై బీజేపీ ( BJP ) తీవ్ర స్థాయిలో మండిపడింది. కేజ్రీవాల్ సహకారం, అనుమతితోనే మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందని ఆరోపించింది. రాజ్యాంగం, చట్టంపై నమ్మకం లేని అరాచకవాదుల సమూహంగా ఆప్ మారిందని ఫైర్ అయ్యింది. ఈడీ ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు అందజేసిందని, ఏ తప్పూ చేయకపోతే విచారణకు ఎందురు హాజరు కాలేదని ప్రశ్నించింది. లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ దిల్లీ ప్రజలను దోచుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు.

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సెర్చ్ వారెంట్‌తో కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతను అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందన్న సమాచారంతో కేజ్రీవాల్ ఇంటి చుట్టూ భద్రతను భారీగా పెంచారు. ఈ అరెస్టును వివిధ పార్టీలు ఖండించాయి. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించాయి. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..!


మరోవైపు.. గురువారం రాత్రంతా కేజ్రీవాల్ ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఉదయం మరోసారి టెస్టులు చేయనున్నారు. 11 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టులో స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

BJP: బీజేపీకి బిగ్ షాక్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ సీఎం ప్రకటన..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 08:44 AM