Share News

BJP: బీజేపీకి బిగ్ షాక్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ సీఎం ప్రకటన..

ABN , Publish Date - Mar 21 , 2024 | 01:34 PM

లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించిన బీజేపీ ( BJP ) నేత డీవీ సదానంద గౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

BJP: బీజేపీకి బిగ్ షాక్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ సీఎం ప్రకటన..

లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించిన బీజేపీ ( BJP ) నేత డీవీ సదానంద గౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బెంగళూరు నార్త్‌ సీటు టికెట్ ఇవ్వాలని కోరినా అధిష్ఠానం ఇవ్వకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన స్థానంలో వేరొకరికి టికెట్ ఇవ్వడంతో తాను అసంతృప్తితో ఉన్నానని తెలిపారు. అయితే కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదని చెప్పిన ఆయన నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చిన మాట వాస్తవమే. కానీ చేరను. బీజేపీ ప్రక్షాళన దిశగా నా ప్రయాణం సాగుతుంది. టికెట్‌ ఇవ్వనందకు బాధగా ఉన్న మాట వాస్తవమే. నన్ను అవమానించిన వారు తర్వాత పశ్చాత్తాపపడతారు. నేను నిస్సహాయుడిని కాను. రాష్ట్ర బీజేపీ కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలి. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించడం సరికాదు. రాష్ట్రంలో నియంతృత్వ ధోరణి జరగకూడదని కోరుకుంటున్నా.

- సదానందగౌడ, మాజీ ముఖ్యమంత్రి

Delhi: నిద్రలోనే కూలిపోయిన ప్రాణాలు.. భవనం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం


మరోవైపు కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తమ పేరు లేకపోవడంపై పలువురు బీజేపీ అగ్రనేతలు అసంతృప్తితో ఉన్నారు. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ విడుదల చేయగా అందులో సదానంద గౌడ, కేఎస్ ఈశ్వరప్ప, కరాడి సంగన్న వంటి అగ్రనేతల పేర్లు లేకపోవడం గమనార్హం.

Patanjali: తప్పుడు ప్రకటనల కేసు.. సుప్రీంకోర్టుకు పతంజలి క్షమాపణలు..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 01:36 PM