Share News

Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..!

ABN , Publish Date - Mar 22 , 2024 | 07:47 AM

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. తన అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ ఆయనను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది.

Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..!

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. తన అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ ఆయనను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది. ఈ పరిణామాలతో దిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ఆప్ అధినేత అరెస్టు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా.. కేజ్రీవాల్ జైలు నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలను కొనసాగిస్తారని ఆప్ తెలిపింది. అయితే ఇది రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Patanjali: తప్పుడు ప్రకటనల కేసు.. సుప్రీంకోర్టుకు పతంజలి క్షమాపణలు..

కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసింది. వాటిని సీఎం పట్టించుకోలేదు. దీంతో ఈడీ సెర్చ్ వారెంట్‌తో గురువారం సాయంత్రం కేజ్రీవాల్ ఇంటికి వచ్చింది. సుదీర్ఘ విచారణ తర్వాత రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లింది. అధికారులు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


కేజ్రీవాల్ అరెస్టును ఆప్ ఖండించింది. ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన కుట్ర అని అభివర్ణించింది. అరెస్టు అయినా ఆయనే దిల్లీ ముఖ్యమంత్రిగా పని చేస్తారని, అవసరం అయితే జైలు నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకుని వారం రోజులు కూడా గడవకముందే కేజ్రీవాల్ అరెస్ట్ కావడం గమనార్హం.

BJP: బీజేపీకి బిగ్ షాక్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ సీఎం ప్రకటన..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 07:51 AM