Share News

Supriya Sule: సునేత్ర పవార్ నాకు తల్లిలాంటి వారు.. సుప్రియా సూలే..

ABN , Publish Date - Apr 01 , 2024 | 10:10 AM

మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) బారామతి నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను పోటీకి దింపింది.

Supriya Sule: సునేత్ర పవార్ నాకు తల్లిలాంటి వారు.. సుప్రియా సూలే..

మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) బారామతి నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను పోటీకి దింపింది. దీంతో లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే ( Supriya Sule ) భారతీయ జనతా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌ను రాజకీయంగా అంతం చేసేందుకు కాషాయం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సునేత్రా పవార్‌పై తనకు చాలా గౌరవం ఉందని, ఆమె తన తల్లి లాంటి వారు అని సుప్రియా తెలిపారు. బీజేపీకి సమర్థులైన అభ్యర్థులు లేరని, అందుకే నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సునేత్ర పవార్‌ను రంగంలోకి దింపడం అభివృద్ధి కోసం కాదని, పవార్ ను అంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Crime News : నా భర్తను చంపితే రూ.50 వేలు ఇస్తా.. సంచలనంగా మారిన వాట్సాప్ స్టేటస్..

"ఇది మరాఠీ మాట్లాడే ప్రజల మధ్య చీలికలు సృష్టించే కుట్ర. మహారాష్ట్ర గుర్తింపునకు దిల్లీ సింహాసనం అడ్డు పడుతోంది. మా పోరాటం ప్రజల కోసం. కానీ ఈ ప్రయత్నాన్ని బీజేపీ వ్యక్తిగతం చేసింది. సునేత్రా పట్ల నాకున్న గౌరవం మునుపటిలాగే ఉంటుంది. అంతర్గత కుయుక్తులతో కుటుంబాలను పడగొట్టాల్సిన అవసరం బీజేపీకి లేదు. మా కుటుంబంలోని వ్యక్తులు తెలివైనవారు. ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. "

సుప్రియా సూలే, ఎంపీ


Andhra Pradesh: ఆ సినిమా ప్రదర్శనలను ఆపేయండి.. కోర్టును ఆశ్రయించిన దస్తగిరి..

బారామతి నుంచి మూడుసార్లు గెలిచి, నాలుగోసారి పోటీ చేయాలనుకుంటున్న సుప్రియా సూలే తన కెరీర్‌లో అత్యంత కఠినమైన ఎన్నికల పోరును ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థి సునేత్రా పవార్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ సామాజిక వర్గాల్లో చురుగ్గా ఉన్నారు. శరద్ పవార్ ఏర్పాటు చేసిన విద్యా ప్రతిష్ఠాన్‌కు ట్రస్టీగా ఉన్నారు. బీజేపీ కూటమిలో చేరాలని అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయంలో సునేత్రా పవార్ ప్రధాన పాత్ర పోషించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 10:11 AM