Share News

Andhra Pradesh: ఆ సినిమా ప్రదర్శనలను ఆపేయండి.. కోర్టును ఆశ్రయించిన దస్తగిరి..

ABN , Publish Date - Apr 01 , 2024 | 08:33 AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy ) హత్య నేపథ్యంలో తీసిన వివేకం సినిమా ఏపీ పాలిటిక్స్ ను కుదిపేస్తున్నాయి. ఈ సినిమాపై అభ్యంతరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో అప్రూవల్ గా ఉన్న దస్తగిరి హైకోర్టును ఆశ్రయించారు.

Andhra Pradesh: ఆ సినిమా ప్రదర్శనలను ఆపేయండి.. కోర్టును ఆశ్రయించిన దస్తగిరి..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy ) హత్య నేపథ్యంలో తీసిన వివేకం సినిమా ఏపీ పాలిటిక్స్ ను కుదిపేస్తున్నాయి. ఈ సినిమాపై అభ్యంతరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో అప్రూవల్ గా ఉన్న దస్తగిరి హైకోర్టును ఆశ్రయించారు. తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉందని, కాబట్టి సినిమా ప్రదర్శనను ఆపేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఐ-టీడీపీ ప్రోత్సాహంతో ఈ సినిమా అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉందని తెలిపారు.

పిటిషనర్ తరఫు లాయర్ జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఈ సినిమా ప్రదర్శినతో పిటిషనర్ నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఇది హక్కులకు భంగం కలిగించడమే అని చెప్పారు. సెన్సార్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఈ సినిమా విడుదలయిందన్నారు. సినిమా ప్రదర్శనను ఆపేయాలంటూ తక్షణమే ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు.


Crime News : నా భర్తను చంపితే రూ.50 వేలు ఇస్తా.. సంచలనంగా మారిన వాట్సాప్ స్టేటస్..

కేవలం రాజకీయ ప్రయోజనాలతో తెలుగుదేశం పార్టీ ఈ సినిమాను ప్రదర్శిస్తోందని దస్తగిరి ఆరోపించారు. తక్షణమే ప్రతివాదులు అందరికీ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా ఈ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 08:33 AM