Share News

Congress: సిద్దూ సంచలనం.. పంజాబ్ సీఎం తన డిప్యూటీగా ఉంటారని సెన్సేషనల్ కామెంట్స్..!!

ABN , Publish Date - Mar 08 , 2024 | 10:25 AM

కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గతంలో ఒకసారి తనను కలిశారని వివరించారు. తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరిచారని సిద్దూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని, తన డిప్యూటీగా పనిచేస్తానని చెప్పారని హాట్ కామెంట్స్ చేశారు.

Congress: సిద్దూ సంచలనం.. పంజాబ్ సీఎం తన డిప్యూటీగా ఉంటారని సెన్సేషనల్ కామెంట్స్..!!

ఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ (Navjot Singh Sidhu) సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గతంలో ఒకసారి తనను కలిశారని వివరించారు. తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరిచారని సిద్దూ (Sidhu) స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని, తన డిప్యూటీగా పనిచేస్తానని చెప్పారని హాట్ కామెంట్స్ చేశారు. సిద్దూ (Sidhu) చేసిన ఈ వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి.

ఇది కూడా చదవండి: Womens Day: మహిళలకు ప్రధాని మోదీ కానుక.. సిలిండర్‌పై ధర తగ్గింపు.. ఎంతంటే..?

‘కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మీతో కలిసి పనిచేస్తా. ఒకవేళ మీరు ఆమ్ ఆద్మీ పార్టీలోకి వస్తానన్న ఫర్లేదు. అక్కడ మీ డిప్యూటీగా పనిచేస్తాను అని’ సిద్దూ బాంబ్ పేల్చారు. తనతో భగవంత్ మాన్ ఇలా అన్నారని వెల్లడించారు. సిద్దూ కాంగ్రెస్ పార్టీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతలో ఆయన పంజాబ్ సీఎం మాన్ గురించి కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: Womens Day: మహిళలకు ప్రధాని మోదీ కానుక.. సిలిండర్‌పై ధర తగ్గింపు.. ఎంతంటే..?

పార్టీ వీడుతున్నారనే ఊహాగానాలకు సంబంధించి సిద్దూను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘తాను కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుని. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి విశ్వసనీయుడిని. రాహుల్ గాంధీని విడిచి మరో పార్టీలోకి వెళ్లే ప్రశ్నే లేదు అని’ సిద్దూ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మాన్ నిజంగా అనుకుంటే ఢిల్లీ వచ్చి పార్టీ పెద్దలను కలువాలని సూచించానని సిద్దూ స్పష్టం చేశారు. ఆ తర్వాత మాన్ స్పందించలేదని.. పార్టీలో చేరిక గురించి మాట్లాడలేదని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: Womens Day: మహిళలకు ప్రధాని మోదీ కానుక.. సిలిండర్‌పై ధర తగ్గింపు.. ఎంతంటే..?

Updated Date - Mar 08 , 2024 | 10:25 AM