Share News

APSRTC: ఉగాది కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:26 PM

బెంగళూరుతోపాటు పరిసర ప్రాంతాల్లో నివసించే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఉగాది పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ (ఏటీఎం) రవీంద్రారెడ్డి తెలిపారు.

APSRTC: ఉగాది కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

బెంగళూరు: బెంగళూరుతోపాటు పరిసర ప్రాంతాల్లో నివసించే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఉగాది పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ (ఏటీఎం) రవీంద్రారెడ్డి తెలిపారు. ఈనెల 5, 6వ తేదీలలో ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆయన మంగళవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసుల్లో ప్రయాణించవచ్చన్నారు. విజయవాడ, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి(Vijayawada, Nellore, Kurnool, Kadapa, Proddutur, Anantapur, Chittoor, Tirupati)తో పాటు రాష్ట్ర పరిధిలోని అన్ని ప్రధాన నగరాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 01:26 PM