Share News

Congress: రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్.. ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు కలిసి అభివాదం

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:24 PM

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు.

Congress: రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్.. ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు కలిసి అభివాదం

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ (Congress)-సమాజ్‌వాదీ పార్టీ(SP) మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పాల్గొననున్నారు. ఆదివారం నాడు అలీగఢ్ నుంచి ఆగ్రా వరకు రాహుల్ జోడో యాత్ర కొనసాగనుంది. ఆ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొంటారు. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా జోడో యాత్రలో పాల్గొంటారు. ఇద్దరు కీలక నేతలు రాహుల్ యాత్రలో పాల్గొనడం కాంగ్రెస్, ఎస్పీ పార్టీలకు కలిసి వస్తోందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏడేళ్ల క్రితం అంటే ఫిబ్రవరి 3, 2017న ఆగ్రాలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల పాటు ఇద్దరు నేతల రోడ్ షో కొనసాగింది. మళ్లీ ఇప్పుడు వారు ప్రజల ముందుకొచ్చారు.

25వ తేదీన (ఆదివారం) రాహుల్ జోడో యాత్ర ఇలా

అలీగఢ్‌లోని జమాల్‌పూర్ నుంచి రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభం

శంషాబాద్ మార్కెట్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ ప్రసంగం

మధ్యాహ్నానానికి హథ్రాస్‌లో గల గాంధీ తిరహాకు యాత్ర, సదాబాద్‌లో భోజన విరామం

ఆగ్రా తెడి బాగియా నుంచి జోడో జోడో యాత్ర ప్రారంభం, తెహ్రలో రాహుల్ గాంధీ ప్రసంగం

తెహ్ర నుంచి రాజస్థాన్‌లో గల ధోల్‌పూర్‌కి రాహుల్ జోడో యాత్ర

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: Jammu And Kashmir: హవ్వా.. కశ్మీర్ ఎన్నికలను సుప్రీంకోర్టు చెబుతుందా..? ఈసీ తీరుపై ఒమర్ అబ్దుల్లా నిప్పులు

Updated Date - Feb 25 , 2024 | 12:24 PM