Share News

Prakash Raj: 400 సీట్ల గురించి 420లు మాట్లాడుతున్నారు.. ప్రకాశ్ రాజ్ విసుర్లు

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:02 AM

లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని భారతీయ జనతా పార్టీ ధీమాతో ఉంది. ఈ సారి 400 సీట్లు గెలుస్తామని ఆత్మవిశ్వాసంతో ఉంది. పలు వేదికల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ప్రధాని మోదీ, బీజేపీ పేరు ఎత్తకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

Prakash Raj: 400 సీట్ల గురించి 420లు మాట్లాడుతున్నారు.. ప్రకాశ్ రాజ్ విసుర్లు

బెంగళూర్: లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని భారతీయ జనతా పార్టీ (BJP) ధీమాతో ఉంది. ఈ సారి 400 సీట్లు గెలుస్తామని ఆత్మవిశ్వాసంతో ఉంది. పలు వేదికల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) స్పందించారు. ప్రధాని మోదీ (Modi), బీజేపీ (BJP) పేరు ఎత్తకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చిక్కమంగళూర్ ప్రెస్ క్లబ్ వద్ద ఆదివారం నాడు మీడియా ప్రతినిధులతో ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మాట్లాడారు.

ఏమన్నారంటే..?

‘లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని 420లు చెబుతున్నారు. అలా చెప్పే రాజకీయ పార్టీ కాంగ్రెస్ కావొచ్చు, ఇతర పార్టీ అయి ఉండొచ్చు. అలా చెప్పడం అహంకారమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400 అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదు. ప్రజలు ఓటు వేస్తేనే సదరు అభ్యర్థి గెలుస్తారు. అలాంటిది ఓ రాజకీయ పార్టీ, ఆ పార్టీ నేత తమ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది. దీనిని ముమ్మాటికీ అహంకారం అంటారు అని’ ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

లోక్ సభ ఎన్నికల్లో తిరిగి తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. ఫిబ్రవరి 5వ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకుంటుందని వివరించారు. ఆ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. బీజేపీ, ప్రధాని మోదీ పేరు ఎత్తకుండా పరోక్షంగా విమర్శలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 11:02 AM