Share News

KCR: మేక్ ఇన్ ఇండియా బక్వాస్.. మోదీపై కేసీఆర్ ఫైర్

ABN , Publish Date - Apr 26 , 2024 | 09:04 PM

బీజేపీ (BJP) దేశాన్ని పదేళ్ల నుంచి పరిపాలిస్తుందని.. దేశానికి ఏం చేసిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

KCR: మేక్ ఇన్ ఇండియా బక్వాస్.. మోదీపై కేసీఆర్ ఫైర్

మహబూబ్‌నగర్: బీజేపీ (BJP) ప్రభుత్వం దేశాన్ని పదేళ్ల నుంచి పరిపాలిస్తుందని.. దేశానికి ఏం చేసిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ వంద నినాదలు చెప్పారని... ఒక్క నినాదమైనా నిజం అయిందా? అని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా బక్వాస్.. డిజిటల్ ఇండియా జరిగిందా? అని నిలదీశారు. ప్రజలకు బీజేపీతో ఏం లాభం జరగలేదన్నారు. మోదీ ఇస్తానని చెప్పిన పదిహేను లక్షల రూపాయలు వచ్చాయా? ప్రధాని మోదీ ఎందుకు విశ్వ గురువు? అని కేసీఆర్ నిలదీశారు.


CM Revanth: రుణమాఫీ చేసి తీరుతాం... హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో.. రేవంత్ కౌంటర్

కేంద్రానికి పాలమూరు ప్రాజెక్ట్ కోసం 100 ఉత్తరాలు రాశామని గుర్తుచేశారు. ఒక్క ప్రాజెక్టుకైనా బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షులుగా ఐదేళ్లు ఉన్నారని పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తీసుకు రాలేదని నిలదీశారు. మరి ఏం మొహం పెట్టుకుని పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. మోదీ ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదన్నారు. మనం బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వేయొద్దని కోరారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణలో వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టకపోతే రూ.ఐదు వేల కోట్ల గ్రాంట్ పోతుందని చెప్పారని... అయినా సరే మీటర్లు పెట్టనని తాను తేల్చిచెప్పానని గుర్తుచేశారు.


Balmoor Venkat: అలాంటి వ్యక్తి వచ్చాడనే గన్‌పార్క్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేశా..

రేవంత్ చోటే భాయ్... మోదీ బడే భాయ్.. బడే భాయ్ చెప్పారని చోటే భాయ్ మీటర్లు పెట్టడానికి ప్లాన్ చేస్తారని విమర్శించారు. తెలంగాణ నీళ్లను తీసుకొని పోతుంటే డీకే అరుణ మంగళ హారతులు పట్టిందని... ఆమెకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఆమెను మహబూబ్ నగర్ ఎంపీగా ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ ఇస్తానని చెప్పిన రూ.15 వేల రైతు బంధు, పంట బోనస్, రుణమాఫీ, తులం బంగారం ఇచ్చారా? అని నిలదీశారు. నలుగురు విద్యార్థులు చనిపోతే దిక్కు లేదన్నారు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను రేవంత్ మోసం చేస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.


Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణను నాశనం చేస్తూ ఉంటే తాను యుద్ధం చేస్తానని.. చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాగా వేయాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. దేవుడి పేరుతో బీజేపీ... దేవుని మీద ఓట్లు వేసి రేవంత్ ఓట్లు అడుగుతున్నారని అన్నారు. రైతు భీమా, రైతు బంధు ఉంటదో, ఉండదో కూడా తెలియడం లేదని చెప్పారు .మన్నే శ్రీనివాస్‌రెడ్డి గెలుపు బీఆర్ఎస్‌కి బలం ఇస్తుందన్నారు. కాంగ్రెస్ హామీలపై పోరాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ కోరారు.


Kothakota Srinivas: ప్రభాకర్‌కు రెడ్‌ కార్నర్ నోటీసులపై హైదరాబాద్ సీపీ షాకింగ్ కామెంట్స్

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 26 , 2024 | 09:18 PM