Share News

TG Elections: రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:59 PM

కాంగ్రెస్ (Congress) అంటేనే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు కొండాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు.

TG Elections: రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..   హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
Harish Rao

సంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ (Congress) అంటేనే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు కొండాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో హరీష్ మాట్లాడుతూ... ఆగస్టు 15 లోపు 39 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. రైతు బంధు పూర్తిగా ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారెంటీలే వారి పాలిట భస్మాసురహస్తం అవుతుందని విమర్శించారు.


CM Revanth: మోదీ - కేసీఆర్ తోడు దొంగలు.. సీఎం రేవంత్‌రెడ్డి విసుర్లు

సీఎం రేవంత్ రెడ్డి తమ అభ్యర్థులను ఎందుకు ఓడించాలో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయన్నారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2500 రూపాయల సహయం, కల్యాణలక్ష్మికి తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్‌ని ఓడించాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలని ఎద్దేవా చేశారు. నాలుగున్నర నెలల్లోనే ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని ప్రజలను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.


Delhi liquor Case: కవిత బెయిల్‌కు అర్హురాలన్న లాయర్లు.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని విమర్శించారు. 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు దేశంలో కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని.. ఈ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, హనుమంతరావులే సీఎంని కలవట్లేదని అంటున్నారని చెప్పారు. సీఎం పదవికి అర్థం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

Raghunandan rao: నా గొంతుని కాపాడండి.. మోసపోయి మీరు ఆగం కావొద్దు

CM Revanth Reddy: కరీంనగర్‌ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం..

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 22 , 2024 | 04:34 PM