Share News

Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 07 , 2024 | 08:07 AM

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు.

Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్..  తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rates

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర కొంత తగ్గుదల కొనిపిస్తే వెంటనే కొనుగోలు చేయడం చేస్తుంటారు. మరి ఈరోజు (07 మే 2024) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.


బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి.

నెఫ్రోప్ల్‌సలో క్వాడ్రియా క్యాపిటల్‌ రూ.850 కోట్ల పెట్టుబడులు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే మే 6 సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు ఒక రూపాయి ధర పెరిగింది. గ్రాము బంగారం ధర రూ.6,606గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.66,060గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 7,206గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.72,060గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.


వివిధ నగరాలలో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి సోమవారంతో పోలిస్తే మంగళవారం గ్రాముకు రూపాయి పెరిగింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,621గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.66,210గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.7,221గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.72,210గా ఉంది.


ముంబైలో..

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.6,606గా ఉంది. అదే పది గ్రాముల బంగారం ధర రూ.66,060గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,206గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.72,060గా ఉంది.


చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,611గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.66,110గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గ్రాము ధర రూ.7,212కు చేరుకోగా, పది గ్రాముల బంగారం ధర రూ.72,120గా ఉంది.


దేశంలో వెండి ధరలు

దేశీయంగా పసిడి ధరల బాటలో వెండి కూడా నడుస్తోంది. మన దేశంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం స్వల్పంగా ధర పెరిగింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలో రూ.87,600గా ఉంది.


Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెచ్చు తగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి ఉండొచ్చు.

రికార్డు స్థాయికి ఎంఎఫ్‌ల పెట్టుబడులు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2024 | 08:13 AM