Share News

AP Elections 2024: ఇవే చివరి ఎన్నికలు నన్ను గెలిపించండి.. సీనియర్ నేత రిక్వెస్ట్..!

ABN , Publish Date - Apr 07 , 2024 | 08:27 AM

ఈసారి జరుగబోయే ఎన్నికలే తనకు చివరి అవకాశంగా భావించి తనను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీడీపీ(TDP) సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు(Chintakayala Ayyanna Patrudu). అనకాపల్లి(Anakapalle) జిల్లా నర్సీపట్నంలో(Narsipatnam) నిర్వహించిన మహిళా మేలుకో కార్యక్రమంలో చింతకాయ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన..

AP Elections 2024: ఇవే చివరి ఎన్నికలు నన్ను గెలిపించండి.. సీనియర్ నేత రిక్వెస్ట్..!
Ayyanna Patrudu

అనకాపల్లి, ఏప్రిల్ 07: ఈసారి జరుగబోయే ఎన్నికలే తనకు చివరి అవకాశంగా భావించి తనను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీడీపీ(TDP) సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు(Chintakayala Ayyanna Patrudu). అనకాపల్లి(Anakapalle) జిల్లా నర్సీపట్నంలో(Narsipatnam) నిర్వహించిన మహిళా మేలుకో కార్యక్రమంలో చింతకాయ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. రాష్ట్రంలో మహిళలకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్(NTR) అని పేర్కొన్నారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలనే రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మహిళలు రాణిస్తున్నారంటే అందుకు కారణం చంద్రబాబు అని పేర్కొన్నారు అయ్యన్న.


ఇదే సమయంలో సీఎం జగన్ పాలనపై అయ్యన్న తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు తెలుగు రాదు, హిందీ రాదు.. ఇంగ్లీష్ రాదని విమర్శించారు. రాజమహేంద్రవరం అని పలకడం కూడా రాదని జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహిళలకు అన్యాయం జరిగితే గన్ కంటే వేగంగా జగన్ వస్తాడని రోజా అన్నారని.. కానీ, జగన్ పాలనలోనే మహిళలకు ఎక్కువ అన్యాయం జరుగుతోందన్నారు. తాను ఎమ్మెల్యేగా 150 పడకల ఆస్పత్రి తీసుకువస్తే.. అలాంటి ఆస్పత్రిలో నేడు సెల్ ఫోన్ లైట్లలో ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకువచ్చాడు నేడు వైసీపీ ఎమ్మెల్యే అంటూ ఫైర్ అయ్యారు అయ్యన్న. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు గెలవాలని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ఎంపీ అభ్యర్థి రమేష్‌ని గెలిపించాలని ప్రజలను కోరారు. తనకు చివరి అవకాశంగా ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలకు అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు.


సొంత చెల్లెని ఇంటినుంచి గెంటేశాడు..

ఈ కార్యక్రమంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. సీఎం జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే సొంత చెల్లెలు షర్మిలను ఇంటి నుంచి బయటకు గెంటేశాడని దుయ్యబట్టారు. మరో చెల్లెలు సునీతను కోర్టు మెట్లు ఎక్కేలా చేశాడని విమర్శించారు. సంక్షేమం పేరుతో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఆరోపించారు రమేష్. జగన్.. అమ్మఒడి ఇచ్చి.. నాన్న జేబులు ఖాళీ చేస్తున్నాడని విమర్శించారు. మద్యం రేట్లు పెంచి కుటుంబాలను ఆర్థికంగా చితికిపోయేలా చేశాడన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని మహిళలను మోసం చేశాడన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడని అన్నారు. గంజాయి, డ్రగ్స్‌తో యువత జీవితాలతో ఆడుకుంటున్నాడని, ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. జగన్‌తో పాటు, స్థానిక వైసీపీ నేతలను తరిమి కొట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు రమేష్. మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ అని రమేష్ కొనియాడారు. మోదీ ఆదేశాలతోనే అనకాపల్లి పార్లమెంట్‌కు తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను, కార్యకర్తలను వేధించిన వైసీపీ నేతలకు.. 37 రోజుల తర్వాత సినిమా చూపిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

నన్నూ నరికేస్తారేమో

అనకాపల్లి జిల్లాలో నేడు పవన్‌ వారాహి విజయభేరి యాత్ర

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2024 | 08:27 AM