Share News

Lokesh: ఓటమి తేలిపోవడంతో ముసుగు తీసేసి జగన్ దుర్మార్గపు చర్యలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:08 PM

Andhrapradesh: ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Lokesh: ఓటమి తేలిపోవడంతో ముసుగు తీసేసి జగన్ దుర్మార్గపు చర్యలు

అమరావతి, మార్చి 4: ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. అయితే దాన్ని జీర్ణించుకోలేని సైకో జగన్... టీడీపీ నేతల (TDP Leaders) ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారని మండిపడ్డారు. మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) అనుచరులైన విజేతారెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, ఫైనాన్షియర్ గురుబ్రహ్మం ఇళ్లపైకి పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించారన్నారు.

CM Revanth: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు..


మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) వెలువడబోతున్న సమయంలో పోలీసులు.. జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమే అని వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకొని జగన్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్‌కు ముందే ఆంధ్రప్రదేశ్‌లో అధికారపార్టీ అరాచకపర్వానికి తెరలేపిన నేపథ్యంలో ప్రత్యేక పరిశీలకులను పంపించాలన్నారు. అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దించాల్సిందిగా కోరుతున్నట్లు లోకేష్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

Anant Radhika Wedding: అనంత్ వాచ్ చూసి ముచ్చటపడ్డ జుకర్ బర్గ్ సతీమణి

PM Modi: అభివృద్ధిలో రేవంత్‌కు పూర్తి సహకారం.. రూ.6 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2024 | 01:16 PM