Share News

నాడు.. నేడు: మరీ ఇంత మార్పు ఏంటి జగన్?

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:54 PM

2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నాడు నేడు. 2019 ఎన్నికల వేళ ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్ జగన్‌‌కి, 2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్‌కు మధ్య చాలా తేడా ఉందని.. ఈ నేపథ్యంలో నాడు నేడు తరహాలో రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

నాడు.. నేడు: మరీ ఇంత మార్పు ఏంటి జగన్?
YS Jagan Mohan Reddy

2019 ఎన్నికల్లో (2019 AP Elections ) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ( YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నాడు నేడు ( nadu - nedu). 2019 ఎన్నికల వేళ ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్ జగన్‌‌కి, 2024 ఎన్నికల ( 2024 AP Elections) వేళ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్‌కు మధ్య చాలా తేడా ఉందని.. ఈ నేపథ్యంలో నాడు-నేడు తరహాలో రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ఆయన ముఖ్యమంత్రిగా అధికార పీఠం ఎక్కిన తర్వాత అమలు చేసిన హామీలకు ఏ మాత్రం పొంతన లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. 2019 ఎన్నికల వేళ వైయస్ జగన్ వెంట అందరు ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

YS Jagan: మళ్లీ తెర మీదకు అదే రాజకీయం..!

పులివెందుల్లోని వైయస్ ఫ్యామిలీ మొత్తం వైయస్ జగన్ వెంటే నడిచిందని.. అలాగే ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ సైతం ఆయన గెలుపు కోసం కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు. ఇక ఆయన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు సైతం వైయస్ జగన్ వెంట అడుగులో అడుగు వేసి మరీ వైయస్ జగన్ వెంట నడిచారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.


నేడు వైయస్ జగన్ వెంట వైయస్ ఫ్యామిలీలోని వైయస్ అవినాష్ రెడ్డితో పాటు వైయస్ జగన్ మేనత్తా వైయస్ విమలారెడ్డి మినహా మరెవ్వరు లేరని చెబుతున్నారు. ఇక ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అయితే ఈ ఎన్నికల్లో జగన్‌ ఓటమి తథ్యమని స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇక వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు టోకున పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల వెంట నడిచేందుకు క్యూ సైతం కడుతున్నారన్నారు.

AP Election 2024: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్

ఇక అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ 16 నెలలు హైదరాబాద్‌లోని చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఆ సమయంలో సోదరుడు వైయస్ జగన్‌కు అండ దండ గా నేనున్నాంటూ.. జగనన్న వదిలిన బాణమంటూ.. వైయస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని గుర్తు చేస్తున్నారు. కానీ నేడు సోదరి వైయస్ షర్మిల.. వైయస్ జగన్ తన కలలోకి కూడా రానీవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి.. వైయస్‌ జగన్‌పైనే తన పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తోందని వారు చెబుతున్నారు.

TDP: జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది: విజయ్ కుమార్

గత ఎన్నికల ముందు వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. అలాంటి సమయంలో ఆ హత్య తాలుక నిందారోపణలన్నీ నాటి చంద్రబాబు ప్రభుత్వానికి వైయస్ జగన్ స్వయంగా అంటగట్టారని చెబుతున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల వేళ.. అదే హత్య తాలుకా నిందోరోపణలన్నీ సీఎం వైయస్ జగన్‌తోపాటు ఆయన సోదరుడు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిపై సోదరిమణులు వైయస్ షర్మిల, వైయస్ సునీతలు కలిసికట్టుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారని వివరిస్తున్నారు.


అదీకాక గత ఎన్నికల వేళ ఇదే వైయస్ జగన్‌ను గద్దనెక్కించేందుకు వైయస్ షర్మిల తీవ్రంగా కష్టపడ్డారని.. కానీ నేడు అదే చెల్లెళ్లు.. వైయస్ జగన్ గద్దెదించేందుకు అంతకంటే అధికంగా కష్టించి పని చేస్తున్నారని పేర్కొంటున్నారు. అంతేకాదు వైయస్ఆర్‌సీపీకి, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ఎవరు ఓటు వేయద్దంటూ.. వారే స్వయంగా మీడియా ముందుకు వచ్చి మరీ ప్రకటనలు గుప్పిస్తున్నారని చెబుతున్నారు.

Elections : ‘పీఏలతో నడుస్తున్న పార్టీ’

ఇక గత ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే.. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నేటికి పట్టాలు ఎక్కలేదని ప్రభుత్వ ఉద్యోగులే స్వయంగా ప్రకటిస్తున్నారని అంటున్నారు.

Lok Sabha Elections: భారీగా నగదు పట్టివేత

తాము అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. తద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని.. కానీ అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో సీఎం వైయస్ జగన్.. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదన్నారు. దీంతో రాష్ట్రంలోని యువత ఉపాది కోసం ఇతర రాష్ట్రాలకు తరలి పోయిందని చెబుతున్నారు. దీంతో యువత ఓట్లు సైతం వైయస్ జగన్‌కు పూర్తిగా దురమయ్యాయనే ఓ ప్రచారం సైతం సాగుతోంది.


ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేశారు. దీంతో పోలవరం తదితర ప్రాజెక్ట్‌ల నిర్మాణం ఎంత వరకు వచ్చిందంటే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా పరిస్థితి తయారైందని అంటున్నారు.

ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్.. రాజధాని అమరావతికి మద్దతు పలికి.. అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రకటన చేశారని... దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల నుంచే కాదు ప్రజలు నుంచి సైతం ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారని వారు గుర్తు చేస్తున్నారు.

Kutami: ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన యార్లగడ్డ వెంకట్రావు

ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ వెంట నాడు అందరు ఉంటే.. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ వెంట నేడు ఎవరు లేరని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా.. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్‌కి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌కి మధ్య చాలా చాలా తేడా ఉందని ఈ సందర్భంగా వారు వివరిస్తున్నారు.

అదీకాక నాడు ప్రతిపక్షనేతగా వైయస్ జగన్‌కు ప్రత్యర్థులుగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉండేవని.. కానీ నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ప్రత్యర్థులు ఆయన ఇంట్లోని చెల్లెళ్లు వైయస్ షర్మిల, వైయస్ సునీతలేనని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా తమదైన శైలిలో విశ్లేషించి మరీ చెబుతున్నారు.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం..

Updated Date - Apr 07 , 2024 | 05:02 PM