Share News

YS Jagan: మళ్లీ తెర మీదకు అదే రాజకీయం..!

ABN , Publish Date - Apr 06 , 2024 | 02:30 PM

శవం ఎదురొస్తే.. మంచి శకునమని శకున శాస్త్రం చెబుతుంది. అయితే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి మాత్రం ‘శవ రాజకీయం’ బాగా కలిసి వస్తుందనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం నాటి నుంచి నేటి వరకు వైయస్ జగన్ శవ రాజకీయాన్నే ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుతున్నారనే ఓ ప్రచారం సైతం సదరు సర్కిల్‌లో నడుస్తోంది.

YS Jagan: మళ్లీ తెర మీదకు అదే రాజకీయం..!

శవం ఎదురొస్తే.. మంచి శకునమని శకున శాస్త్రం చెబుతుంది. అయితే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి మాత్రం ‘శవ రాజకీయం’ బాగా కలిసి వస్తుందనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం నాటి నుంచి నేటి వరకు వైయస్ జగన్ శవ రాజకీయాన్నేఆలంబనగా చేసుకొని ముందుకు సాగుతున్నారనే ఓ ప్రచారం సైతం సదరు సర్కిల్‌లో నడుస్తోంది. తాజాగా ఎన్నికల వేళ పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

దీంతో లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేసే వారు లేకపోవడంతో సచివాలయానికి వెళ్తున్నారు. ఆ క్రమంలో నేటి వరకు అంటే.. ఏప్రిల్ 1 నుంచి నేటి వరకు ఈ ఆరు రోజుల్లో 33 మంది మృతి చెందారు. అయితే దీనిని కూడా తమకు అనుకూలంగా మాలుచుకొనేందుకు అధికార వైసీపీ వ్యవహరించే ప్రయత్నం చేస్తోందనే చర్చ సాగుతోంది. ఎన్నికల వేళ పెన్షన్ పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదంటూ ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి.

అందువల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని ప్రజల్లోకి వైసీపీ ఓ ప్రచారాన్ని తీసుకు వెళ్లే ప్రయత్నాన్ని చేపట్టింది. దీంతో మళ్లీ ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి రావాలి. తాను ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ వ్యవహార శైలి ఉందనే రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం అయితే వాడి వేడిగా హల్ చల్ చేస్తోంది.

AP Politics: అప్పుడే నరికేసేదాన్ని.. అవినాష్‌పై సునీత సంచలన కామెంట్స్..!


వరుసగా రెండోసారి అధికారం అందుకోవడం కోసం.. వైయస్ జగన్ ఈ తరహా రాజకీయానికి తెర తీశారనే ఓ ప్రచారం సైతం సాగుతోంది. 2009లో తండ్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైయ్యారు. నాటి నుంచి చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఓ సారి నిశితంగా పరిశీలిస్తే వైయస్ జగన్ వ్యవహారం తేటతెల్లమవుతుందని స్పష్టమవుతోంది.

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సీఎం పీఠం కోసం నాడు వైయస్ జగన్ సంతకాల సేకరణ చేశారనే ఓ ప్రచారం అయితే నేటికి మనుగడలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైయస్ జగన్‌కు అధికారం కట్టబెట్టేందుకు ససేమీరా అంది. దీంతో ఓదార్పు యాత్రను అడ్డం పెట్టుకొని.. బైపాస్‌ రూట్‌లో అధికారం అందుకోవాలని వైయస్ జగన్ నిర్ణయించారు.

ఆ క్రమంలో స్థాపించిందే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక 2014 ఎన్నికల వేళ పార్టీ గెలుపు కోసం వైయస్ జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. దీంతో విడిపోయిన రాష్ట్రం.. రాజధాని లేని రాష్ట్రం... అలాంటి రాష్ట్రానికి.. రాజకీయాలపైనే కాదు, పరిపాలనపై ఏ మాత్రం అవగాహన లేని వైయస్ జగన్‌ను ప్రజలు పక్కన పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రజలు టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టడంతో.. చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

Atchannaidu: ‘ముస్లింలను నమ్మకూడదు’ అన్న వైసీపీకి ఓటుతో బుద్ధిచెప్పాలి


అయితే చంద్రబాబు పాలనలో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటానంటూ ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ఇక ఎన్నికలకు జస్ట్ ఆరు నెలల సమయం ఉండగా.. విశాఖ ఎయిర్ పోర్ట్ వేదికగా వైయస్ జగన్‌పై కోడి కత్తి దాడి జరిగింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. ఇక సరిగ్గా ఎన్నికల ముందు పులివెందుల్లో వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు.

దీంతో కోడి కత్తి దాడి, వైయస్ వివేకా దారుణ హత్యతోపాటు తన తండ్రి వైయస్ఆర్ హెలికాప్టర్ దుర్ఘటనలన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్నాయంటూ.. వైయస్ వివేకా మృతదేహం పక్కనే ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ మీడియా ముందు వివరించారని రాజకీయ వర్గాలు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నాయి. అధికారమనే రుచి మరిగిన తర్వాత... అది ఎలాగైనా సాధించుకోవాలి. అందుకు సామ, ధాన, భేద, దండోపాయాలను ప్రయోగించాలి. అయితే మనకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయనుకుంటే మాత్రం సెంటిమెంట్ అనే ఆయుధాన్ని ప్రయోగించాలి.

అందుకు నీరు, కన్నీరు, రక్తం ఏదైనా రాజకీయానికి ముడి సరుకుగా వాడుకోవాలి. ఆ క్రమంలో అవసరమైతే శవ రాజకీయానికి అయినా తెర తీయాలి. అలా అయితేనే మనం కోరుకున్న అధికారం.. మనం అనుకున్న విధంగా మన దరికి వస్తుందనే ఓ భావన ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌లో నిగూఢంగా నిబిడికృతమై ఉన్నాయనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది.

YS Sharmila: బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు.. షర్మిల

మరిన్నీ ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 06 , 2024 | 03:01 PM