Home » Kodi Kathi
ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న పాత పౌల్ట్రీ ఫారమ్‌లో నిర్వహిస్తున్న భారీ కోడి పందేల స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు.
AB Venkateswara Rao: వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేయడానికి తన పోరాటం మొదలైందని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అందులోభాగంగా తొలి ప్రయత్నంగా కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆ క్రమంలో ముమ్మడివరంలోని కోడికత్తి శ్రీనును అతడి నివాసంలో ఆయన కలిశారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టుకు నిందితుడు జనపల్లి శ్రీనివాస్ (కోడికత్తి శ్రీను) హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంగా వైఎస్ జగన్ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు.
ఎన్నడూ లేని విధంగా ఈసారి వందల చోట్ల కోడి పందేలు ఏర్పాటుకావడంతో కొన్నిచోట్ల పందేలకు అవసరమైన కోడి జాతులు రాకపోవడంతో పందెం రాయుళ్లు.....
విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన కోడికత్తి కేసు విచారణకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. జగన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్, ఆయన తరఫు న్యాయవాది సలీం, దళిత సంఘాల నేతలు కోర్టుకు వచ్చారు.
‘కోడికత్తి’ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
కోడికత్తి కేసులో సుప్రీం కోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్ట్ నిరాకరించింది.
కోడికత్తి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం ముమ్మడివరం కూటమి అభ్యర్థి, టీడీపీ నాయకుడు దాట్ల బుచ్చిబాబు సమక్షంలో కోడికత్తి శ్రీను ఆ పార్టీలో చేరారు. అనంతరం కోడికత్తి శ్రీను మాట్లాడుతూ... వైసీపీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం.. చేసిన ప్రయత్నం వల్ల తాను ఐదేళ్లు జైల్లో మగ్గాల్సి వచ్చిందన్నారు. జైలు నుంచి తన విడుదల కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్... 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా నాటి ఘటనలనే ఫాలో అవుతున్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఏఫ్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడలోని సింగ్ నగర్‌లో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై ఆగంతకులు రెండు రాళ్లు వేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ను అడ్వకేట్ గుణ్ణం వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను కుటుంబం గురువారం కలిసింది.