Share News

AP Politics: అప్పుడే నరికేసేదాన్ని.. అవినాష్‌పై సునీత సంచలన కామెంట్స్..!

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:11 PM

ఎన్నికల వేళ సంచలనానికి తెరలేపారు వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha). వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసులో న్యాయం చేయాలంటూ ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 2009 వైఎస్ఆర్(YSR) మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను..

AP Politics: అప్పుడే నరికేసేదాన్ని.. అవినాష్‌పై సునీత సంచలన కామెంట్స్..!
YS Sunitha

హైదరాబాద్, ఏప్రిల్ 06: ఎన్నికల వేళ సంచలనానికి తెరలేపారు వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha). వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసులో న్యాయం చేయాలంటూ ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 2009 వైఎస్ఆర్(YSR) మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను కుట్రలో భాగంగా పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీలతో సబంధం లేదని సునీత స్పష్టం చేశారు. తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలు, బ్యూరో క్రాట్స్‌ని కలిశానని, కలుస్తానని స్పష్టం చేశారు. ఎవరి పని వాళ్ళు చేస్తే తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. తనకు ఫేవర్ చేయాలని కూడా తాను కోరుకోవడం లేదన్నారు. వివేక కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.


అందుకే షర్మిల పక్కన పెట్టారు..

జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని అంతా తానై షర్మిల చూసుకుందన్నారు సునీత. 3,000 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ కోసమే షర్మిల చేసిందని గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసిన కుటుంబ సభ్యులు షర్మిల, వివేకాకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు. జగన్ జైల్‌లో ఉన్న సమయంలో 2012 బై ఎలక్షన్లలో షర్మిల పోరాటంతోనే వైసీపీకి సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. షర్మిల చరిష్మా చూసి అక్కసుతో ఆమెను దూరం పెట్టారని ఆరోపించారు. 2019 ఎలక్షన్‌లో షర్మిలకు కడప లేదా వైజాగ్ నుండి సీటు ఇస్తారని భావించారన్నారు. కానీ, షర్మిలకు ఎలాంటి సీటును జగన్ కేటాయించలేదన్నారు.


అవినాష్ రెడ్డిని ఓడించండి..

2024 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఓడిపోవాలి షర్మిల గెలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు సునీత. తమ కుటుంబంలో కడప ఎంపి సీట్ చాలా కీలకం అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక 2009 నుండి కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయని అన్నారు. కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే సీట్లలో తమ కుటుంబం నుండే పోటీ చేశారని సునీత పేర్కొన్నారు. 2009 ముందు వరకు ఎంపీగా వివేకా, ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పోటీ చేస్తూ వచ్చారన్నారు.


అందుకే ప్రజాక్షేత్రంలో పోరాటం..

సీబీఐ , కోర్టులలో న్యాయం జరగాలంటే ఆలస్యం అవుతుందని.. అందుకే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నానని చెప్పారు సునీత. అవినాష్ రెడ్డి లాంటి హంతకులు చట్టసభలకు వెళ్లొద్దు అన్నదే తన ధ్యేయం అని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసమే వివేకానంద రెడ్డిని హత్య చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు సునీత. 2019 ఎన్నికల్లో అవినాష్ గెలుపు కోసమే వివేకా ప్రచారం చేశాడని.. కానీ అవినాష్ వాళ్ళు చంపాలనుకున్నారని సునీత ఆరోపించారు. ప్రతికారం తీర్చుకోవడం తన ధ్యేయం కాదన్నారు. అలా అనుకుంటే కడపకు వెళ్లి తానే నరికేసే దానిని అంటూ సంచలన కామెంట్స్ చేశారు.


ఏ పార్టీ లేదు..

తన వెనకాల టీడీపీ ఉందని అందరూ భావిస్తున్నారని.. కానీ, ఏ పార్టీ లేదని సునీత స్పస్టం చేశారు. జగన్, విజయమ్మ కాంగ్రెస్‌కు రాజీనామా చేసింది వివేకాకు మంత్రి పదవి ఇచ్చినందుకేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకానంద రెడ్డి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవన్నారు. వివేకా హత్య వెనకాల బెంగళూరు లాండ్ సెటిల్మెంట్ కానీ, ఎలాంటి ఇతర కారణాలు లేవని సిబిఐ చెప్పిందని గుర్తు చేశారు. పులివెందులలో వివేకానంద రెడ్డి రాజకీయ పత్రా లేకుండా కుట్ర చేశారన్నారు. ఆయన ఓటును సైతం 2019 ఎన్నికలకు ముందు తొలగించారన్నారు. రేపటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఓడిపోయినా కూడా తన పోరాటం కొనసాగుతుందని సునీత స్పష్టం చేశారు.


సునీత ప్రజెంటేషన్ పాయింట్స్ క్లుప్తంగా..

 • సిబిఐ కేసులో జగన్ అరెస్ట్

 • జగన్ జైలుకు వెళ్ళాక పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల

 • 2012 ఇడుపుల పాయ నుండి షర్మిల పాదయాత్ర స్టార్ట్ చేసి 2013 ముగించింది.

 • 2012 బై ఎలక్షన్స్.

 • 2014 లో జరిగిన ఎన్నికల్లో జరిగిన రాజకీయ పరిణామాలు.

 • కడప ఎంపీ సీట్ కోసం అవినాష్ రెడ్డి కి సీట్ కేటాయింపు.

 • ఎమ్మెల్సీగా నిలబెట్టి వైఎస్ వివేకాను వెన్ను పోటుతో ఓడించారు.

 • 2017 లో కడప ఎంపీ సీట్ కోసం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వివేక.

 • షర్మిల కూడా కడప ఎంపీ కోసం ప్రయత్నాలు.

 • 2019 లో పార్టీ గెలుపు కోసం వైఎస్ వివేక విపరీతంగా కృషి చేసారు.

 • కడప ఆత్మీయ సమ్మేళనం పేరుతో మీటింగ్.

 • 2019 లో వివేకా ఓటు గల్లంతు పోలీసులకు ఫిర్యాదు.

 • మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2024 | 01:35 PM